అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా ఉంది వాతావరణం పరిస్థితి. నెలక్రితం జోరు వానలు పడ్డాయి. ఆ తర్వాత వానలు ముఖం చాటేశాయి. ఎండకాలంలో ఎండలు దంచికొట్టాయి. సరైన వర్షాల కోసం రైతులు మొన్నటి వరకు ఎదురుచూశారు. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరి పంటలకు జీవం వచ్చింది. సోయాబీన్‌లాంటి పంటలకు నీరు నిలిస్తే కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. కానీ వరికి మాత్రం ఈ వానలు కొత్త జీవం పోశాయి. ఎండిపోయే దశకు వచ్చిన పంటలకు వరుసగా కురుస్తున్న వానలు జీవం పోశాయనే చెప్పాలి. కాగా ఈసారి గతంలో కన్నా వరి సాగు గణనీయంగా పెరిగింది. మధ్యలో యూరియా సమస్య వచ్చి పడింది. ఈ సీజన్ మొదటి నుంచి రైతులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కొక్కటిగా గట్టెక్కుతూ వస్తున్నాడు. ఇలా ఇప్పుడు వానలు కూడా రైతన్న చింత తీర్చి కొంత ఊరటనిచ్చాయి.