#నర్సింగ్_స్టాఫ్
కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్న సమయంలో అందరం తలుపులు మూసుకొని ఇళ్లల్లో ఉంటే
మేమున్నము అని ముందుంటూ
అయిన వారికి దూరంగా ఉంటూ పాలిచ్చే పసిపాపలను కూడా వదిలి
వాళ్లేమైపోతారో అని వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో
జనాల ఆరోగ్యమే ముఖ్యం అని వృత్తి ధర్మాన్ని నమ్మి రాత్రనక పగలనక అలసట లేకుండా అలుపెరుగని యుద్ధం చేసిన వాళ్లు
డ్యూటీ గ్యాప్ లో ఏదో అలసట తీరడానికి విశ్రాంతి సమయంలో సరదాగా ట్రెండ్ సెట్టర్ పాటకు నృత్యం చేసి ఉంటారు అంతమాత్రాన
చేసిన కఠోర శ్రమ ను మరచి ఇంత చిన్న దానికి శిక్ష వెయ్యడం సరైన చర్య కాదు
వాళ్ళు కూడా డ్యూటీ డ్రెస్ లో ఉండి అలా చెయ్యాల్సింది కాదు ఏదో తెలియని సంతోషం వాళ్ళను అలా చేయించింది అని భావిస్తూ కావాలని చేసింది కాదు అని క్షమిస్తూ
చిన్న మందలింపు తో వదిలేస్తే మంచిది అని నా విన్నపం
Ramu Mandala