షర్మిల పార్టీ. ఇంకా బాలారిష్టాలు దాటలేదు. వచ్చిందే తడువు ఎక్కడికో వెళ్లిపోవాలనే ఆరాటమే తప్ప పోరాటం లేదు. మాటల దూకుడే తప్ప పరిపక్వత లేదు. ఆవేశమే తప్ప ఆలోచన లేదు. నోటికొచ్చినట్టు తిట్టేస్తే మైలేజీ వస్తుందనే వ్యూహకర్తల మాటలు పాటించి .. ఎదుగూ బొదుగు లేకుండా ఉండిపోయిన పార్టీకి ఇందిరాశోభన్ గుడ్‌బై చెప్పింది. అసలది ఇంకా పార్టీగా పూర్తిగా రూపాంతరం చెందనే లేదు. పదవులే లేవు. నాయకులకు పొజిషనే లేదు. అలాంటప్పుడు ఇందిరాశోభన్ కీలకనేతేం కాదు. ఉత్తి కార్యకర్తే. అందులో ఉన్నది ఒకే ఒక్క లీడర్. షర్మిలే.
గాడిదలు కాస్తున్నారా? అంటూ ఇక్కడి నేతలకు ఆమెచ్చిన గౌరవం చాలు అందులో పనిచేయడమంటే బానిసలకన్నా అధ్వాన్నమని. కానీ ఏదో కొత్త పార్టీ. కొత్త అవకాశాలు అనే ఆశావాదుల, అవకాశవాదులకు ఓ ప్లాట్‌ఫాంగా ఇది కనిపించింది. అందుకే అలా వెళ్లారు. షర్మిల అపరిపక్వ రాజకీయాలు చూసి జడుసుకుని జంప్ అవుతున్నారు.
కేటీఆర్ ఎవరు? అన్నప్పుడే ఆమె స్థాయి, స్టామినా తెలిసిపోయింది. ఎంత సబ్జెక్టు ఉందో తేలిపోయింది. ఆమె పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తనే చెప్పేసింది. ఎవరిస్తున్నారో ఆమెకు సలహాలు? కాబోయే సీఎం నేను అంటుంది. నా స్థానికత ఇదే అని చెప్పుకోవడానికే ఆమె సరిపోయింది. ఇక ఇక్కడి ప్రజలను ఓన్ చేసుకుని ముందుకు సాగడం ఆమెకంతా ఈజీ కాదు.
ఇందిరా శోభన్ ఎవరో కూడా జనాలకు అంతగా తెలియదు. ఆ పార్టీలో ఆమెకున్న పొజిషనేమిటో కూడా తెలియదు. ఇక కీలకవికెట్.. నెంబర్ టూ… ఆ పార్టీకి అంతసీన్ లేదు.
