‘నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్తా పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గ‌ని..
అందాల దున్యానే సూపిత్తా పా.. చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్క‌ని…’

పాట‌కు నూత‌న వ‌ధువు బ‌రాత్‌లో వరుడితో క‌లిసి చేసిన డ్యాన్సు చిన్నాపెద్దా తేడాలేకుండా అంద‌రినీ ఉర్రూత‌లూగించింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ పాట‌ను ల‌క్ష‌ల్లో వీక్షిస్తున్న‌వారే గానీ.. ఆమె గురించి తెలుసుకోవ‌డం కుద‌ర‌లేదు చాలా మందికి. ‘వాస్త‌వం’ వెబ్ సైట్ ప్ర‌త్యేకంగా ఆమె వివ‌రాలు సేక‌రించింది. ఇవీ ఆ వివరాలు.

మంచిర్యాల జిల్లా జ‌న్నారం మండ‌ల కేంద్రానికి చెందిన ‘ప‌య్యావుల సాయి శ్రియ’కు చిన్న‌ప్ప‌టి నుంచి డ్యాన్సంటే ప్రాణం. స్కూల్ ఏజ్ నుంచే వేదికల మీద పాట‌ల‌కు అనుగుణంగా డ్యాన్సు చేసి అంద‌రిమెప్పూ పొందేది. నాన్న అట‌వీశాఖ‌లో ఉద్యోగి. మున్నూరు కాపు సామాజిక వ‌ర్గం. బీటెక్ పూర్తి చేసింది. పెళ్లికి ముందు హైద‌రాబాద్‌లో కొద్ది రోజుల పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగం కూడా చేసింది. సంప్ర‌దాయ‌క కుటుంబం. గారాభంతో పాటు మంచి క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పెంచాడు తండ్రి. త‌ల్లి గృహిణి. ఒక అన్న‌య్య ఉన్నాడు. చిన్న కుటుంబం. అల్లారుముద్దుగా పెరిగింది సాయి శ్రియ‌. త‌ల్లిదండ్రులు చూపెట్టిన పెళ్లి సంబంధం ‘ఓకే’ చేసింది. వ‌రుడు ‘మ‌హేశ్‌..’ మంచిర్యాల మున్సిపాలిటీలో ఉద్యోగి. ఈ ఏడాది మే నెల‌లో ఎంగేజ్‌మెంట‌య్యింది. పెళ్లి కూడా అప్పుడే పెట్టుకోవాల‌నుకున్నారు. కానీ క‌రోనా, లాక్‌డౌన్‌తో మూడునెల‌ల పాటు వాయిదా ప‌డింది. ఈ మూడు నెల‌లు ఒక‌ర్నొక‌రు అర్థం చేసుకునేందుకు వెసులుబాటు చిక్కింది. ఒక‌రి అభిరుచులు ఒక‌రు తెలుసుకున్నారు. ఇష్టాయిష్టాలు పంచుకున్నారు. పేరుకు అరేంజ్ మ్యారేజే.. కానీ చూసిన వారికి ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అనేంత‌లా ఇద్ద‌రు.. ‘ఒక‌రికొక‌రు’లా క‌లిసిపోయారు. ఈనెల 14న వీరి వివాహం జ‌రిగింది.

అంత‌కు ముందు సంగీత్ (హ‌ల్దీ ఫంక్ష‌న్‌)లో ‘బుల్లెట్టు బండి..’ పాట‌కు అనుగుణంగా ఆమె డ్యాన్సు చేయ‌డంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. చాలా బాగా చేశావ‌నే ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. పెళ్లి బ‌రాత్‌లో ఆమెతో ఈ పాట‌మీదే ప్ర‌త్యేకంగా డ్యాన్సుచేయించారు. అలా ఆమె పాట‌క‌నుగుణంగా చేసిన డ్యాన్సును కొంద‌రు రికార్డు చేసి త‌మ ఫోన్లో స్టేట‌స్‌గా పెట్టుకున్నారు.పూర్తి వీడియోను సంపాదించి కొంద‌రు సోష‌ల్ మీడియాలో పెట్టారు. నిమిషాల్లోనే ఇది వైర‌ల్ గా మారింది. ప‌రిచ‌యం ఉన్న‌వాళ్లు, ఊర్లోవాళ్లు.. అంతా ఆ ఇంటికి వ‌చ్చి ఆమెను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. అక్కడ జాతరను తలపించేలా జనం వచ్చి పోతున్నారు. ఆమె ఒక్క‌రాత్రిలోనే సెలెబ్రిటీగా మారింది. తండ్రి ప్రేమ‌, పెంప‌కంలో ఇచ్చిన స్వేచ్చ‌, క్ర‌మ‌శిక్ష‌ణ.. ఆమెలోని బిడియం స్థానంలో ఆత్మ‌విశ్వాసాన్ని నింపింది. అదే ఆమెను ఈ రోజు ప్ర‌త్యేకంగా నిల‌బెట్టింది. అంద‌రికీ ప్రత్యేక ఆక‌ర్షణ అయ్యింది. అమ్మాయిలంటే సిగ్గు,అణ‌కువే కాదు.. ఇలా చొర‌వ కూడా ఉండాలె అని నిరూపించింది.

బుల్లెట్టు బండి…. పూర్తి పాట‌

ప‌ట్టుచీర‌నే క‌ట్టుకున్నా… గ‌ట్టుకున్నుల్లో పెట్టుకున్నా..
టిక్లీ బొట్టే పెట్టుకున్నా.. వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా..
న‌డుముకు వ‌డ్డాణం వెట్టుకున్నా.. వెట్టుకున్న‌ల్లో సుట్టుకున్నా..
దిష్టిసుక్క‌ను దిద్దుకున్నా.. దిద్దుకున్న‌ల్లో దిద్దుకున్నా..

పెళ్లికూతురు ముస్తాబురో.. నువ్వు యాడంగ వొస్తావురో..
చెయ్యి నీచేతికిస్తానురో… అడుగు నీ అడుగులేస్తానురో..
నేను మెచ్చీ న‌న్నే మెచ్చ‌టోడా.. ఇట్టే వ‌స్తా రానీ వెంట‌..

నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్తా పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గ‌ని..
అందాల దున్యానే సూపిత్తా పా.. చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్క‌ని…

నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్తా పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గ‌ని..
అందాల దున్యానే సూపిత్తా పా.. చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్క‌ని…

చెరువుక‌ట్ట‌పొంటి చేమంతివ‌నం..బంతివ‌నం చేమంతి వ‌నం.
చేమంతులు తెంపి అల్లుకున్నా.. అల్లుకున్నుల్లో అల్లుకున్నా..

మా ఊరువారంల‌ జూడు మ‌ల్లెవ‌నం.. మ‌ల్లెవ‌నంలో మ‌ల్లెవ‌నం..
మా మ‌ల్లెలు తెంపి వొళ్లు నింపుకున్నా.. నింపుకున్నుల్లో నింపుకున్నా..

నువ్వు న‌న్నేలుకున్నావురో.. దండమెల్లోన వేస్తానురో..
నేను నీ ఏలు వ‌ట్టుకోని.. మ‌ల్లె జ‌ల్లోను అయినానురో..
మంచి మ‌ర్యాద‌లు తెలిసిన‌దాన్నీ.. మ‌ట్టి మ‌నుషుల్లో పెరిగిన దాన్నీ..

నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్తా పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గ‌ని..
అందాల దున్యానే సూపిత్తా పా.. చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్క‌ని…

నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్తా పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గ‌ని..
అందాల దున్యానే సూపిత్తా పా.. చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్క‌ని…

నే అవ్వ‌సాటు ఆడ‌పిల్ల‌న‌య్యో… పిల్ల‌నయ్యో ఆడ‌పిల్ల‌న‌య్యో…
మా నాన్న గుండెల్లో ప్రేమ‌న‌య్యో.. ప్రేమ‌న‌య్యో..నే ప్రేమ‌నయ్యో…

ఏడు గ‌డ‌ప‌ల‌ల్లో ఒక్క‌దాన్నిర‌య్యో… దాన్నిర‌య్యో… ఒక్క దాన్నిరయ్యో..
మా అన్న‌ద‌మ్ముల‌కు ప్రాణ‌మ‌య్యో..ప్రాణ‌మ‌య్యో… నేను ప్రాణ‌మ‌య్యో..

పండు ఎన్న‌ల్లో ఎత్తుకొని.. ఎన్న‌ముద్ద‌లు వెట్టుకోని
ఎన్ని మారాలు జేస్తూఉన్నా.. న‌న్ను గారాలు జేసుకోని..
చేతుల్లో పెంచారు.. పువ్వ‌ల్లే న‌న్ను.. నీ చేతికిస్తారా న‌న్నేరా నేను..

నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్తా పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గ‌ని..
అందాల దున్యానే సూపిత్తా పా.. చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్క‌ని…

నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్తా పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గ‌ని..
అందాల దున్యానే సూపిత్తా పా.. చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్క‌ని…

నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా.. వెంటినంకుల్లో వెట్టినంకా..
సిరి సంప‌ద సంబూరం క‌ల్గునింకా.. క‌ల్గునింకుల్లో గ‌ల్గునింకా..

నిన్ను క‌న్నోల్లే క‌న్నోళ్లు అన్నుకుంటా.. అన్నుకుంటుల్లోఅన్నుకుంటా…
నీ క‌ష్టాల్లో భాగాలు పంచుకుంటా.. పంచుకుంటుల్లో పంచుకుంటా..

సుక్క‌పొద్దుకే నిద్ర‌లేచీ…సుక్క‌లా ముగ్గులాకిట్లేసీ…
సుక్క‌లేని న‌న్నుజూసీ.. మురిసిపోయేను నీతో క‌లిసీ..

నా ఏడు జ‌న్మాలూ నీకిచ్చుకుంట.. నీతోడులో న‌న్ను నే మెచ్చుకుంటా..

You missed