అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న పుష్ప పై భారీ అంచ‌నాలున్నాయి. రంగ‌స్థ‌లం త‌ర్వాత సుకుమార్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇది. రంగ‌స్థ‌లం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఓ ప‌క్కా మాస్ హీరోగా పుష్ప పేరుతో అల్లు అర్జున్ ను తెర పైన కొత్త‌గా ఆవిష్క‌రించేందుకు తంటాలు ప‌డుతున్నాడు సుకుమార్‌. రంగ‌స్థ‌లంలో విభిన్న పాత్ర ద్వారా రాంచ‌ర‌ణ్‌ను ప‌రిచ‌యం చేసి స‌క్సెస్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప‌ను కూడా ప‌తాక స్థాయిలో నిల‌బెట్టేందుకు కొత్త క‌థ‌తో, కొంగొత్త టేకింగ్‌తో సినిమా రూపొందిస్తున్నాడు.

క‌రోనా వ‌ల్లో మారెంటోకార‌ణ‌మేంటో తెలియ‌దు కానీ.. సీక్వెల్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న‌ది. పార్ట్ వ‌న్‌గా వ‌స్తున్న పుష్ప సినిమాలోని ఓ పాట ఫ‌స్ట్‌లుక్‌ను ఈ రోజు విడుద‌ల చేశారు. చంద్ర‌బోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ పాట అంచ‌నాల‌ను అందుకోవ‌డ‌మేమో కానీ క‌నీసం యావ‌రేజ్‌గా కూడా లేద‌నే టాక్‌ను మూట‌గ‌ట్టుకున్న‌ది. నెటిజ‌న్లు ఈ పాట పై ట్రోలింగ్ మీద ట్రోలింగ్ వేస్తున్నారు. ఈ పాట‌కు అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు మ‌రింత న‌వ్వొచ్చేలా ఉన్నాయని అంటున్నారు నెటిజ‌న్లు.

దాక్కో దాక్కో.. మేకా..పులొచ్చి కొరుకుద్ది పీకా.. హుయ్‌..!… అని బోస్ రాసిన ఈ పాట ఓ క‌వితలా ఉంది త‌ప్పితే.. ఓ పాట‌లా లేద‌నే ట్రోలింగులు చేశారు. ఇదేం డ్యాన్సురా నాయ‌న‌.. టైర్‌లో గాలికొట్టిన‌ట్టు.. ఏం బాగ‌లేదు. బ‌న్నీ ఏందీ.. ఈ స్టెప్స్ ఏందీ? అని మ‌రికొంద‌రు పెద‌వి విరిచారు.

 

 దాక్కోదాక్కో మేక .. పూర్తి పాట‌..

వెలుతురు తింట‌ది ఆకు..
ఆకును తింట‌ది మేక‌..
మేక‌ను తింట‌ది పులే… ఇది క‌ద‌రా ఆక‌లే…

పులినే తింట‌ది చావు..
చావును తింట‌ది కాలం..
కాలాన్ని తింట‌ది కాళే.. ఇది మ‌హా ఆక‌లే..

వేటాడేది ఒక‌టే… ప‌రిగెత్తేది ఇంకొక‌టి..
దొరికిందా ఇది స‌స్తాది.. దొర‌క్క‌పోతే అది స‌స్తాదీ..
ఒక‌జీవికి ఆక‌లేసిందా… ఇంకో జీవికి ఆయువు మూడిందే…

దాక్కో దాక్కో.. మేకా..పులొచ్చి కొరుకుద్ది పీకా.. హుయ్‌..!

చాప‌కు పురుగు ఎరా… పిట్ట‌కు నూక‌లు ఎరా..
కుక్క‌కు మాసం ముక్క ఎరా..
మ‌నుషులంద‌రికి బ‌తుకే ఎరా..!

గంగ‌మ్మ త‌ల్లి జాత‌రా..
కోళ్లు, పొటేళ్ల కోత‌రా..
క‌త్తికి నెత్తుటి పూత‌రా..
దేవ‌త‌కైనా త‌ప్ప‌దు ఎర‌.. ఇది లోకం త‌ల‌రాత‌రా..!

ఏమ‌రుపాటుగా ఉన్నావా… ఎర‌కే చిక్కేస్తావు..
ఎర‌నే మింగేటి ఆక‌లుంటేనే ఇక్క‌డ బ‌తికుంటావు..

కాలే క‌డ‌పు సూడ‌దురో.. నీతీన్యాయమ్‌..
బ‌ల‌మున్నోడిదేరా ఇక్క‌డ ఇష్టారాజ్యమ్‌….

దాక్కో దాక్కో.. మేకా..పులొచ్చి కొరుకుద్ది పీకా.. హుయ్‌..!

అడిగితే పుట్ట‌దు అరువు.. బ‌తిమాలితే బ‌తికే బ‌రువు
కొట్ట‌ర ఉండ‌దు క‌రువు.. దేవుడికైనా దెబ్బే గురువు..
త‌న్నులు చేసే మేలూ.. త‌మ్ముడు కూడా చేయ‌డు..
గుద్దులు చెప్పే పాఠం.. బుద్దుడు కూడా చెప్ప‌డు..

త‌గ్గేదేలే

You missed