ఆది నుంచి నమస్తే తెలంగాణలో కొనసాగిన వారిపై కత్తికట్టాడు కొత్త ఎడిటర్ తీగుళ్ల కృష్ణమూర్తి. వెంటాడి, వేటాడి వారిని జీవితాలను చెల్లాచెదరుచేసిన తర్వాత గానీ నిద్రపోలేదు. అప్పుడు గానీ అతని మనస్సు శాంతించలేదు. అంతే పాతవారంతా.. పాతుకుపోయినవారిగా, అక్రమార్కులుగా చీత్రీకరించాడు. కొత్త నీటిని తెచ్చుకున్నాడు. ఆంధ్రజ్యోతి నుంచి. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే తమ వంతుగా మేనేజ్‌మెంట్ పాలసీ ప్రకారం తమ అక్షరాలతో రాళ్లేశారో… ఇప్పడు వాళ్లే నమస్తే తెలంగాణలో మెయిన్ రాతగాళ్లయ్యారు. అయినా మాది ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆరే స్వయంగా ప్రకటించి… తన రాజకీయ అవసరాల కోసం ఉద్యమంలో ద్రోహం చేసిన వారికి పదవులిస్తుంటే… ఆయన ఏరి కోరి తెచ్చుకున్న తీగుళ్ల మాత్రం దీనికి వ్యతిరేకంగా ఎందుకుపోతాడు. అలాగే పోయాడు.
ఒక్కొక్కిరినీ మెడలు పట్టి బయటకు గెంటేస్తూ వచ్చాడు. ఇంకా అతని దాహం తీరలేదు. చాలా మందిపై డేగ చూపులు అలాగే ఉన్నాయి. వారికి ఎప్పుడు మూడుతుందో తెలియదు. ప్రధాన విభాగాల్లో తన అనుచరులను తీసుకొచ్చి పెట్టాడు. వారిలో బ్రాహ్మణులే ఎక్కువ. కోస్తా బ్రాహ్మణులు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ల నుంచి తన శిష్యులను, అనుచరులను, తనకు భజన చేసేవారిని మాత్రమే తీసుకొని మంచి మంచి జీతాలిప్పించుకున్నాడు. మంచి జీతాలెలా ఇప్పిస్తాడు? అనుకుంటున్నారా. పాతవారందినీ సాగనంపి.. మేనేజ్‌మెంట్ జీతాల భారం దించాడు కదా. ఇప్పుడు ఎండీ తనకు నచ్చిన వారికి, నచ్చినంతా జీతం ఇవ్వాల్సిందే అలాగే ఇప్పించుకున్నాడు.
శేఖర్‌రెడ్డి తన కులపోళ్లతో, అనుచరులతో నమస్తే తెలంగాణను భర్తీ చేశాడని, వీరంతా ఉద్యమ ద్రోహులని, కేసీఆర్ వ్యతిరేకులని ఆయన అభిప్రాయం. అందుకే రెడ్లు అనే తోక ఉంటే చాలు తోక తొక్కిన తాచు అయ్యేవాడు. నల్లగొండ బ్యూరో ఇన్ఛ్‌చార్జి జూలకంటి రాజేందర్‌రెడ్డితో తన ఊచకోత ప్రారంభించాడు. జిందగీ, ఫీచర్స్ ఎడిటర్ బీరెడ్డి నగేశ్‌రెడ్డిని నవ్వుతూ నల్లబాలు లెక్క నాకేశాడు. సంగారెడ్డి బ్యూరో ఇన్చార్జి మధుసూదన్‌రెడ్డిని సిటీ బ్యూరో పేరుతో అప్రాధాన్య శాఖలిచ్చి తనకు తాను వెళ్లిపోయేలా పొగబెట్టాడు. మెదక్ స్టాపర్ శ్రీనివాస్‌రెడ్డిని తీసేసి వందలసార్లు ఆఫీసు చుట్టు ప్రదక్షిణలు చేపించుకున్నాడు. ఇంకా అతనికి ఆశ చావలేదు. ఇతనికి ఇచ్చే ఉద్దేశమూ లేదు. ఆదిలాబాద్ బ్యూరో ఇన్చార్జి చిన్నారెడ్డిని అదును చూసి దెబ్బతీశాడు. స్టేట్ బ్యూరోలో కోటిరెడ్డి పై అస్త్రశస్త్రాలు ప్రయోగించాడు. యూనియన్ లీడర్ కాబట్టి బతికి బట్టకట్టాడు. మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి.. టీఆరెస్ పెద్దల వద్దకు వెళ్లి లబోదిబోమన్నాడు. మొరపెట్టుకున్నాడు. ఏదో అలా ప్రాధన్యత లేని శాఖలిచ్చి బలవంతంగా కొనసాగిస్తున్నాడు. ఎప్పుడు స్పాట్ పెడతాడో తెలియక మనోడు రోజూ చచ్చి బతుకుతున్నాడు.
అయితే బ్రాహ్మణ్.. లేదా వెలమ
ఓరుగంటి సతీష్ తన అనుచరులను పెట్టుకునేందుకుప్రయత్నిస్తాడు. ఈనాడు టీం అంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ. వాళ్లు మాత్రమే జర్నలిస్టులు. కృష్ణమూర్తి బ్రాహ్మడుంటే చాలు వాణ్ణి కళ్లకద్దుకుంటాడు. తప్పేముంది కేసీఆరే కళ్లకద్దుకుంటాడు. అంతా బ్రాహ్మణులతో నింపేయి అని కూడా కేసీఆరే స్వయంగా తనకు చెప్పాడని కూడా ఈ కొత్త ఎడిటరే స్వయంగా చెప్పుకున్నాడు పలువురి దగ్గర. ఇక ఎస్జీవీ తన కులపోళ్లంటే ప్రేమ. వాళ్లను కాపాడుకుంటాడు. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేస్తాడు. మేడ్చల్‌లో ఆర్సీగా కూడా పనికి రాని రామారావు అనే బ్రాహ్మడికి స్టాఫర్ అవకాశం వచ్చింది. మంచిర్యాలలో ఎడిటర్ చుట్టం కోసం అరుణ్ అనే ఉద్యోగి బలైపోయాడు. ఖమ్మంలో రవీందర్‌ను దారుణంగా అవమానించి పంపేశాడు. అక్కడ తీసుకున్న కొత్త బ్యూరో దగ్గర పదిలక్షలు వసూలు చేశాడనే ఆరోపణలున్నాయి. ఎక్కడ చెడిందో అతన్నీ తీసేశాడు. రామచంద్రమూర్తి చెప్పాడని ఓ కొత్త అతనికి అవకాశం వచ్చింది. వెలమల కోసం నిజామాబాద్ నుంచి దండుగుల శ్రీనివాస్‌ను తప్పించి … జూపల్లి రమేశ్‌ను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వరంగల్‌లో నూర శ్రీనివాస్‌ను రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు రప్పించి.. అక్కడ గోపాల్‌రావును సీటిచ్చారు. కరీంనగర్‌ను ప్రకాశ్‌రావు మకుటం లేని మహారాజుగా వెలిగిపోతున్నాడు. ఎడిటర్లు ఎందరు మారినా.. తన జోలికి వచ్చేవాడుండడు. సంగారెడ్డిలో తనకు భజన చేసే వ్యక్తికి బ్యూరోగా అవకాశం ఇచ్చాడు. ఆఖరికి సాక్షిలో సీ గ్రేడ్ వచ్చి తీసి పడేసిన నాగరాజు అనే అతన్ని కళ్లకద్దుకొని మెదక్ స్టాఫర్‌గా పెట్టుకున్నాడు. పొరిగింటి పుల్లకూర రుచి కదా… అప్పటి వరకు నమస్తేను నమ్ముకున్నోళ్లంతా దొంగలయ్యారు. ఈ దొరగారు వచ్చిన తర్వాత ఆంధ్రోళ్లు అందలమెక్కారు.
ఓ ముగ్గురినలుగురిని పెట్టుకొని హెడ్ ఆఫీసులో అన్నివిభాగాల్లో కోవర్టు ఆపరేషన్ చేయిస్తాడు ఈయన. శ్రావణ్, నవీన్‌రెడ్డి.. కృ.తికి రెండుకళ్లు. వీళ్లు అన్ని విభాగాల్లో తిరిగి ఓ రిపోర్టును ఎడిటర్‌కు అందిస్తారు.. వెంటనే వాళ్ల తలలు తెగి గేటు అవతల పడతాయన్నమాట. ఆఖరికి ఈ కొత్త ఎడిటర్ తన డ్రైవర్‌ను కూడా నమస్తే తెలంగాణ ఎంప్లాయిగా చేసేశాడు. కారు నడిపించుకుంటాడు. కానీ ఎంప్లాయిగా జీతం తీసుకుంటాడు. నమస్తే తెలంగాణ యూట్యూబ్ ఛానల్ కోసం తీసుకున్న టీంతో బండచాకిరి, వెట్టిచాకిరి చేయించుకున్నాడు. అది ఒక దారిలో పడగానే ఛానలూ వద్దు, మీరూ వద్దు పొండి.. అని లాక్‌డౌన్‌లో బయటకు గెంటేశాడు.
అవునూ… పాత వాళ్లందరినీ వాళ్ల మనుషులు, వీళ్ల మనుషులు, ఈ కులపోళ్లు, ఆ కులపోళ్లు అని తీసేశావు. నీకు ఏదో రోజు మూడుతుంది. అప్పుడు నీవు తెచ్చుకున్న మనుషులు రోడ్డున పడరా? వాళ్లకు కుటుంబాలు లేవా? పెండ్లాం పిల్లలు లేరా? ఈ చిన్న లాజిక్ ఎలా మరిచావు కృ.తి.
(కేటీఆర్ సార్.. మీ పత్రికలోనే ఇంత మంది రోడ్డున పడ్డారు. మీరెవరికి ఉద్యోగాలిస్తున్నారు… రేపు)