నిజామాబాద్ న‌గ‌రంలోని వినాయ‌క్‌న‌గ‌ర్ 45వ డివిజ‌న్ బీజేపీ కార్పొరేట‌ర్ భ‌ర్త ఆకుల శ్రీ‌నివాస్ ఓ డాక్ట‌ర్‌తో ప‌రార‌య్యాడు. న‌గ‌రంలోని ఓ ప్ర‌ముఖ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఓ మ‌హిళ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డిన కార్పొరేట‌ర్ భ‌ర్త నిన్న ఆమెతో క‌లిసి ప‌రార‌య్యాడు. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆమెతో చ‌నువు పెంచుకున్న ఆకుల శ్రీ‌నివాస్ పెళ్లి చేసుకుంటాన‌ని ప‌లుమార్లు అమ్మాయి త‌ల్లిదండ్రుల‌తో కూడా మాట్లాడిన‌ట్లు తెలిసింది. దీనికి వారు ఒప్పుకోలేదు. శ్రీ‌నివాస్ భార్య కార్పొరేట‌ర్‌గా గెల‌వ‌డంతో పెళ్లి విష‌యంలో మ‌రింత ఒత్తిడి పెంచాడు. విన‌క‌పోవ‌డంతో ఆమెతో ప‌రార‌య్యాడు. దీనిపై ఆ మ‌హిళ తండ్రి న‌గ‌రంలోని నాల్గోటౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. స‌ద‌రు మ‌హిళకు ఇది వ‌ర‌కే వివాహం కాగా విడాకులు తీసుకున్న‌ట్లు తెలిసింది. ఆకుల శ్రీ‌నివాస్‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఇందూరు రాజ‌కీయంలో ఈ సంఘ‌ట‌న‌ హ‌ట్‌టాఫిక్‌గా మారింది.

You missed