సీఎం సీట్ ఇచ్చే..
3 ఎకరాలు ఇచ్చే…
డబుల్ బెడ్రూం లు ఇచ్చిండూ
రైతులకు ఉచిత యూరియా వచ్చేసింది..
జిల్లాకో సూపర్ స్పెషాలిటీ దవాఖాన కట్టేసిండు..
లక్ష ఉద్యోగాలు నింపేసే..
టాంక్ బండ్ విగ్రహాలు తీసి పారేసే..
అడ్డదిడ్డంగా ఉన్న రింగ్ రోడ్ ను సక్కగా చేసే..
మెట్రో రైలు పీకి పారేసే…
లక్ష నాగళ్లతో దున్నేసే…
12 % రిజర్వేషన్ అమలయే..
N convention కుల్చి పారేసే..
లంక లొ పుట్టిన రాక్షసులను దూరం పెట్టే..
చిన్న పెద్ద కాంట్రాక్టు లన్ని మన తెలంగాణ వారికే వచ్చే..
అమరులకుటుంబాలను ఆదుకునే..
తండలన్ని పంచాయితీ లాయే..
తెలంగాణ ద్రోహులను దూరం పెట్టే..
సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ వారిదే అగ్ర స్థానం ఆయే..
హుసేన్ సాగర్ నీళ్ళు తాగు నీటి కి పనికోచ్చే…
మూసీ నది ముసి ముసిగా నవ్వవట్టే..
గొర్లతో కోటిస్వరులయే..
చేపలతో లక్షలు వచ్చి పడే..
కుల భవనాలు మెరిసిపోతుండే..
100 అడుగుల విగ్రహం అయిపాయే..
ఆకశా హర్మ్యాలు అబ్బుర పరిచే..
లండన్ ఇస్తాంబుల్ సింగపూర్ సిగ్గు పడుతుoడే..

అట్లనే ఇపుడు బారబర్ 10 లక్షలు ఇస్తడు..

నమ్మకుంటే నీ అంత మూర్ఖుడు లేడు
అందుకే మళ్ళీ ఒకసారి ఎత్తుకుందాం గులాబీ జెండా…
ఎవడన్నా అడిగితే బంగారు తెలంగాణ పునర్నిర్మానం అని చెబుదాం…

 

(Shiva Kumar Gande)

You missed