త‌న భార్య‌కు ప‌లువురితో అక్ర‌మ సంబంధాలున్నాయ‌నే అనుమానంతో ఓ భ‌ర్త దారుణానికి ఒడిగ‌ట్టాడు. గాడ నిద్ర‌లో ఉన్న భార్య‌, కూతురిని గొడ్డ‌లితో న‌రికి చంపేశాడు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండ‌లంలో ఈ దారుణం జ‌రిగింది. గంగాధ‌ర్ ఆటో న‌డుపుకుంటూ , భార్య మ‌ల్లీశ్వ‌రి (30), కూతురు (13) పోషిస్తున్నాడు. ప‌దిహేడు ఏండ్ల క్రితం వీరికి వివాహం జ‌రిగింది. ఆరోజు నుంచి కాపురంలో క‌ల‌త‌లు, అనుమానాల‌తో గొడ‌వ ప‌డేవారు. ప‌లుమార్లు పెద్ద‌ల స‌మ‌క్షంలో పంచాయితీ నిర్వ‌హించినా గంగాధ‌ర్‌కు త‌న భార్య పై అనుమానం పోలేదు. శుక్ర‌వారం తెల్ల‌వారు జామునా నిద్రిస్తున్నా ఇద్ద‌రిని గొడ్డ‌లితో న‌రికి చంపేసి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు. త‌న కూతురు ఎప్ప‌డూ త‌ల్లివైపే స‌పోర్టుగా మాట్లాడ‌డంతో ఆమెను కూడా ఆమెను క‌డ‌తేర్చిన‌ట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

You missed