హాస్పిటల్‌లో ఉన్న బంధువును పరామర్శించేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు (70) శ్రుకవారం నీళ్లనుకొని బాటిల్‌లో ఉన్న యాసిడ్‌ను తాగి మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడిలో గల జయ హాస్పిటల్‌లో యజమాన్యం నిర్లక్ష్యంతో ఈ సంఘటన చోటు చేసుకున్నది. వేల్పూర్ మండలం మోతె గ్రామానికి చెందిన సాయమ్మ తన బంధువును పరామర్శించేందుకు జిల్లా కేంద్రంలో గల హాస్పిటల్‌కు వచ్చింది. నీళ్లనుకొని యాసిడ్ తాగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లగా వైద్యులు వెంటనే చికిత్సనందించినా వృద్ధురాలు తుదిశ్వాస విడిచింది. ఈ నేపథ్యంలో కుటుంబీకులు వైద్యుల నిర్లక్ష్యంగానే సాయమ్మ మరణించిందని హాస్పిటల్ ఎదుట మృతురాలు శవంతో భైఠాయించారు. ఈ విషయ్నాన్ని తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.