వాంటెడ్ రిపోర్టర్స్….పెద్ద పేపర్లకూ తప్పని విలేకరుల కొరత…. విలేకరులు కావాలెను… ఇది ఎవర్ గ్రీన్ ప్రకటన…. ఇచ్చేది గొర్రెతోక లైన్ అకౌంట్… చేపించేది బారెడు చాకిరీ….
విలేకరులు కరువయ్యారు. కొరత ఏర్పడింది. ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ పత్రికలో ఎంపిక కావాలంటే సవాలక్ష ఆంక్షలు, పరీక్షలు, శల్య పరీక్షలు… ఇప్పుడు ఆ మెయిన్ స్ట్రీమ్ పత్రిక విలేకరుల కోసం వెతుక్కుంటుంది. విలేకరుల కావాలెను అని ప్రతీ నెలకోసారి ఇలా ప్రకటనలు…