స్పీకర్‌పై సీఎం గుస్సా…! అసెంబ్లీ సెషన్స్‌లో బీఆరెస్‌కు ఎక్కువ టైం ఇవ్వడంపై నారాజ్…! అంతటా బాగుందనే ప్రశంస… సీఎం పెదవి విరుపుతో అంతర్గత అసంతృప్తి…!
(దండుగుల శ్రీనివాస్) సేమ్ కేసీఆర్ లెక్కనే. అధికారం రాగానే సీఎంలు ఇలాగే మారుతారు. స్పీకర్‌పై సీఎం గుస్సా అయ్యిండు. ఎందుకు..? ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం ఇచ్చిండని. వారి గొంతు ఎక్కువ పెంచేందుకు సమయం చిక్కిందని. దీనికి బాధ్యుడిని స్పీకర్‌ను చేశాడు సీఎం…