తెలుగు ప్రేక్షకుడి నాడి పట్టుకోవాలంటే సన్నీ లియోన్‌లు కాదు ప్రయోగించాల్సింది.. సర్దార్ లాంటి కథ, ప్రయోగాత్మక ప్రయత్నం…. సేఫేజోన్‌లో ఉండి నాటకాలాడితే మనం ఇక్కడే ఉంటాం… పక్కోడొచ్చి ఇక్కడ ఇలా చప్పట్లు కొట్టించుకుంటాడు….
థియేటర్‌లో సినిమాలు చూసి చాలా రోజులైంది. దీపావళి ఇచ్చిన సమయం రెండు సినిమాలు చూసేందుకు వీలైంది. ఒకటి జిన్నా… రెండోది సర్దార్. జిన్నా … కథ ఎంపికలో మంచు విష్టు తన నటన, ఇమేజ్‌లాగే పూర్తిగా జారిపోయి పాతాళంలోకి పడిపోయాడని మరోసారి…