దావతే ఇఫ్తార్ … ఓ పెద్ద అవినీతి భాగోత కార్యక్రమం… ఆ మతం ఇలా చేయొద్దంటున్నా.. పాలకులు మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తి… మస్జీద్‌లకు లక్ష రూపాయల చొప్పున కేటాయింపు… ఎల్బీ స్టేడియంలో ఈనెల 25న గ్రాండ్ ఇఫ్తార్ విందు.. దీని కోసం రూ. 4 కోట్ల ఖర్చు..! రంజాన్ సందర్భంగా మొత్తం రూ. 70 కోట్లు కేటాయింపు.. జీవో విడుదల… ఇది మాకు వొద్దంటున్న ముస్లిం కాంగ్రెస్ లీడర్, సోషల్ ఎన్విరాన్‌మెంటల్ యాక్టివిస్ట్ లుబ్నా సర్వత్…! గతంలో కేసీఆర్‌కూ లేఖ.. ఇప్పుడు రేవంత్‌కూ వద్దని వారిస్తున్న వైనం.. రంజాన్ వేళ ఇదో కొత్త సంస్కరణల పర్వం.. ఓటు బ్యాంకు రాజకీయాలపై గొంతెత్తిన గళం..
(దండుగుల శ్రీనివాస్) దావతే ఇఫ్తార్… రంజాన్ తోఫా…! ఈ పేర్లతో పాలకులు ఆ మతాన్ని కించపరుస్తున్నారా..? ముస్లింలను గౌరవిస్తున్నాం.. వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నాం.. అని పాలకులు చెబుతున్నదంతా వారిని అవమానపర్చడంలో భాగమేనా..? ఏటా దీని కోసం వెచ్చిస్తున్న వందల కోట్లు అవినీతికి…