నువ్వు కొట్టినట్టు చెయ్ నేను ఏడ్చినట్టు చేస్తా! బీజేపీ తో లోపాయికారి ఒప్పందం ఉత్త తూచ్…! ప్రజలను నమ్మించే యత్నమా!! విలీనం ఉండదన్న స్టేట్ ప్రెసిడెంట్… పొత్తు కూడా ఉండదనడం లేదు కేటీఆర్ నోటి వెంటా విలీనం లేదనే మాటే.. పొత్తు గురించి గప్‌చుప్ లోకల్ బాడీ ఎన్నికల వేళ ఆల్టర్నేట్ మేమంటే మేమనేలా ఆ రెండు పార్టీల చర్యలు
(దండుగుల శ్రీనివాస్) బీజేపీ, బీఆరెస్ ఒకర్నొకరు తిట్టుకుంటున్నారు. వాదులాడుకుంటున్నారు. ఆల్టర్నేట్ పార్టీగా మేమంటే మేమని నిరూపించుకునే క్రమంలో హద్దులు దాటి రాజకీయాలు చేస్తున్నారు. మేము కలిసిపోలేదు. కలవడం లేదు. విలీనం లేదు. అంతా తూచ్ అని ప్రజలను నమ్మించే ప్రయత్నంలో రాజకీయాలు…