పీసీసీ చీఫ్ ఇలాఖాలో గౌడ్లకు తీవ్ర అవమానం…! కుల బహిష్కరణ చేసిన వీడీసీ పెద్దలు..!! ఏడు నెలలుగా వీడీసీపై పోరాడుతున్న గౌడ కులస్తులు… కుల సంఘాల నాయకులు..! మహేశ్ కుమార్ గౌడ్ సొంత నియోజకవర్గ బాల్కొండలో దారుణం.. ఇక్కడ వీడీసీ పెద్దలతో అధికారం, పెత్తనం…! వారి జోలికి వెళ్లేందుకూ భయపడ్తున్న నాయకులు…! వీడీసీ పెద్దలపై తూతూ మంత్రం కేసులు..అరెస్టులు లేవు..! రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాల్లో కదలిక..!! అన్ని కులలాకూ ఇక్కడ ఇదే గతి… జరిమానాలు విధించడం.. వినకపోతే కుల బహిష్కరణలు..
(దండుగుల శ్రీనివాస్) అక్కడంతే. పెద్దరాయుడి తీర్పులు ఇస్తారు. వారే అక్కడ అధికారులు, పోలీసులు. సమాంతర ప్రభుత్వం నడుపుతూ ఉంటారు. దీనికి ముద్దుగా విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ (వీడీసీ) అని పేరు పెట్టుకుంటారు. ఆ పేరుతో ఆ గ్రామాలను చెరబడతారు. వారు చెప్పింది…