కోడ్ సాకు ముగిసింది….! ఖజానా ఖాళీ కహానీ ఇక వినే స్థితిలో లేరు..!! పథకాలు ప్రారంభించండి రేవంతు సారు..!! పదే పదే అవే అప్పుల తిప్పల మాటల వల్లెవేయకండి…! జనాలు చీదరించుకుంటున్నారు…! ఆదాయానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకండి… ధరలు పెంచడమే మార్గంగా ఆలోచిస్తే అంతే సంగతులు…!! ఇక పాలన గాడిలో పడాలి… నోరుగాయి చేసుకుంటు కాలం గడిపే రోజులు పోయాయి…
(దండుగుల శ్రీనివాస్) 09Vastavam.in (4) ఎమ్మెల్సీ ఎన్నికల సాకు ముగిసింది. ఆర్బాటంగా ప్రవేశపెట్టిన పథకాలను ఇప్పుడిక పంచాల్సిందే. ఇవ్వాల్సిందే. నిధుల్లేవు. ఖజానా ఖాళీ. కేసీఆర్ అప్పులకు మిత్తీలు కడుతున్నాం లాంటి మాటలిక కట్టిపెట్టాలి. రేవంత్ చెప్పి చెప్పి.. జనం వినీ వినీ…
