‘గ్రూపు’ల నేతలకు రామన్న హితబోధ… అహంకారం వీడి అలకలు మాని అప్రమత్తంగా ఉండాలి.. కామారెడ్డి నేతలకు కేటీఆర్ చురకలు, సందేశాలు, లక్ష్యాలు.. కాంగ్రెస్, బీజేపీలను తక్కువ అంచనా వేయొద్దని హితవు.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, గంప, ముజీబుద్దీన్‌లకు కీలక బాధ్యతలు.. మెజారిటీ తెచ్చేందుకు కీలక బాధ్యతలు, కర్తవ్యాలు..
మంత్రి కేటీఆర్ హితోపదేశం చేశారు. స్వయంగా గులాబీ దళపతి, ఉద్యమ నేత వచ్చి కామారెడ్డిలో పోటీ చేస్తుంటే.. ఇక్కడ నేతలు గ్రూపులు కట్టి.. ఎవరికి వారే ఉండటాన్ని గమనించిన కేటీఆర్ .. ఏకంగా బహిరంగ సభనే పెట్టి నేతలకు చురకలంటించారు. కర్తవ్యబోధ…