ఓడినా మిమ్మల్ని వీడలేదు.. ఇందూరు ఆమె ఇల్లు… మీరంతా కుటుంబ సభ్యులు.. పసుపు బోర్డు పేరు చెప్పి గెలిచిన అర్వింద్ ఏనాడైనా మీ పల్లెలకు వచ్చిండా…? మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ న్యాల్‌కల్‌లో బాజిరెడ్డి, కవితలతో కలిసి చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇందూరు, డిచ్‌పల్లిలో ఫిష్‌మార్కెట్ బిల్డింగులకు శంఖుస్థాపనలు..
కల్వకుంట్ల కవితను అబద్దాల అర్వింద్ మాటలు విని ఓడగొట్టుకున్నారని, ఆమె ఓడినా ప్రజలను వీడలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆమెకు ఇందూరు సొంతిల్లులాంటిదని, ఇక్కడి ప్రజలంతా కుటుంబ సభ్యులేనని అందుకే ఆమె నాయకురాలిగా మీ అందరి బాగోగులు చూసుకుంటూ…