కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు హుష్‌కాకి.. ‘కోడ్’తో ఆశలు గల్లంతు… కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న జనాలు…ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలిసీ, కోడ్ మీద పడుతుందనీ గ్రహించినా.. కావాలనే ప్రభుత్వం దీన్ని విస్మరించింది. పేదలకు చేతిచ్చిందా…!
ఎన్నికల కోడ్ చాలా మంది పేదల ఆశలపై నీళ్లు పోసింది. కొత్త పింఛన్ల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని కలెక్టరేట్ చుట్టూ ఏళ్లుగా ప్రదక్షిణలు చేస్తూ వస్తున్నారు. దరఖాస్తులు తీసుకున్నారు. వాటిని అలాగే పెట్టేశారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు…