అది మూసీ పునరుజ్జీవం… ! లక్షన్నర కోట్లు కాదు.. 141 కోట్లే…! అపోహలు, ప్రచారాలతో అందరినీ తప్పుదోవ పట్టించిన కేటీఆర్..! మూసీ పై సుధీర్ఘ ప్రెస్‌మీట్‌లో సందేహాలు నివృత్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. !!అనాథలుగా చేయం.. నిరాశ్రయులుగా మిగల్చం… ! మంచి జీవితాలందిస్తాం.. పరిహారమిచ్చి ఆదుకుంటాం.. ఉపాధి అవకాశాలిస్తాం…!!
(దండుగుల శ్రీనివాస్) మూసీ ప్రక్షాళనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రభుత్వం.. ప్రతిపక్ష చేస్తున్న ఆరోపణలు, సృష్టిస్తున్న అపోహలను నివృత్తి చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌ను వేదికగా చేసుకున్నారు. సుధీర్ఘమైన ఈ ప్రెస్‌మీట్ పూర్తిగా మూసీపైనే సాగింది.…