రేవంత్ ఒంటరి..! హైడ్రాపై లీడర్ల అసంతృప్తి…!! సీఎం ఆలోచనకు సొంత పార్టీలోనే మద్దతు కరువు..!! పార్టీకి నష్టం జరుగుతుందని గ్రహించిన పీసీసీ చీఫ్ మహేశ్… గ్రేటర్ ఎమ్మెల్యేలతో సపరేట్‌గా మీటింగ్…. హైడ్రా, మూసీ ఉదంతాలు సర్కార్‌కు చెడ్డపేరే… ముక్తకంఠంతో కాంగ్రెస్ శ్రేణులంతా రేవంత్ దూకుడును ఖండిస్తున్న వైనం.. రుణమాఫీపై రాంగ్ స్టెప్… ఇప్పుడు హైడ్రా ఓ బ్లండర్ మిస్టేక్…
(దండుగుల శ్రీనివాస్) రుణమాఫీపై రేవంత్ రాంగ్ స్టెప్ వేశాడు. అది అధిష్టానం గుర్తించింది. కొండంత రాగం తీసి.. పార్టీ పరువును తీసేవిధంగా, రైతులతో అంతరం పెంచుకునే విధంగానే రేవంత్ ఆలోచన చేశాడు. ఆ నష్టం పార్టీకి జరిగింది. దాన్నుంచి కోలుకోక ముందే…