ఇగ తిట్టుడు…కొట్టుడు..! స్టేట్ చీఫ్ గిట్లనే వుండాలే..!! దూకుడు పెంచిన ఈటల… బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఈయనకే… క్లాస్ కాదు.. ఇక ఊరమాస్‌గా మారాలె…! హైడ్రా నుంచే పెరిగిన ఈటల స్వరం.. తాజాగా భట్టిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు ఆల్టర్నేట్ మేమే అని చెప్పేందుకు బీజేపీ తండ్లాట..
(దండుగుల శ్రీనివాస్) సాఫ్ట్‌గా ఉంటే కుదరదు. సౌమ్యుడిగా పేరు గడిస్తే పదవులు దరి చేరవు. క్లాస్‌గా ఉంటే పట్టించుకోరు.. ఊర మాస్ అవతారమెత్తితే ఆకాశానికెత్తుతారు. పార్టీకి జవజీవాలు పోయాలంటే వార్తల్లో ఉండాలె. వార్తలకెక్కాలంటే తిట్టాలి. అవసరమైతే కొట్టాలి. తిట్టి కొట్టాలె. కొట్టుకుంటూ…
