సారొస్తారు.. వెళ్తారు! కేవలం మొక్కుబడి హాజరు కోసేమేనా? అనర్హత వేటు పడకుండా ఉండేందుకేనా..? నీటి వాటాల డిస్కషన్ పాల్గొనని కేసీఆర్… హరీశ్‌రావుతోనే నెట్టుకొచ్చేందుకు డిసైడ్..
వాస్తవం ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్: శీతాకాలం సమావేశాలు గరం గరంగా మొదలు కాబోతున్నాయి. ఈ సమావేశాలకు కేసీఆర్ వస్తారు.. వస్తారు.. వస్తారు.. వచ్చేస్తున్నారు.. అంటూ ఒకటే ఊదరగొడుతున్నారంతా. కానీ ఆయన వస్తాడు. వచ్చినట్టే వచ్చి వెళ్లిపోతాడు. అంతే. అంతకు మించి…
