అనుకోని అతిథి… మూడు గంటల పాటు డిచ్‌పల్లిలో బాజిరెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత హల్‌చల్… అక్కడి ప్రజలతో మమేకం.. స్థానిక సమస్యలపై ఆరా.. డిచ్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి లేక ప్రజల ఇబ్బందులు కళ్లారా చూసిన ఎమ్మెల్సీ.. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి హామీ… సెల్పీలతో సరదాగా.. యోగక్షేమాలడుగుతూ గల్లీల్లో పర్యటన… హోటల్‌లో కాఫీ.. నాయకులు, కార్యకర్తలతో మాటామంతీ….
ఎమ్మెల్సీ కవిత డిచ్‌పల్లి వాసులకు అనుకోని అతిథి అయ్యారు. నిజామాబాద్‌లో అప్పటి వరకు బిజీబిజీగా గడిపిన ఆమె.. సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌తో కలిసి ఆకస్మిక పర్యటన చేశారు. డిచ్‌పల్లిలో ఆగి అక్కడ…
