మునుగోడు ఉప ఎన్నిక ఏమోగానీ.. ఆ నియోజకవర్గంలో పత్తి చేలు ఆగమవుతున్నాయి. కూలీలు దొరకడం లేదు. మొన్నటి వరకు ఇలా పిలిస్తే అలా పొద్దున్నే వాలిపోయే కూలీజనం ఇప్పుడు … పిలిచినా పలకడం లేదు. ఇంటికి వెళ్తే కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ఈ కూలీకంటే ఆ ప్రచారంలో పాల్గొని నేతలకు జిందాబాదులు కొడితే సరి… మంచి గిట్టుబాటు ధర వస్తోంది మరి. కూలీకన్నా రెండుమూడింతలు ఎక్కువగా రేటు పలుకుతున్నారు జనం ప్రచారం కోసం. అందులో ఒక్క పార్టీ కాదాయే.! మూడు పార్టీలు.
జనం పరిస్తితి ఎలా ఉందంటే.. మూడు పార్టీలు… ఆరు వేల రూపాయలు అన్నట్టుగా. ఇంక కూలీకేం పోతరు. పొద్దున్నుంచి రెక్కలు పోయేలా పత్తేరితే వచ్చేది మూడు నాలుగొందలు. మరి ఇక్కడైతే పైసలకు తోడు… మందు, తిండి అదనం. భలే మంచి చౌక బేరం కాదా…! అందుకే అక్కడ కూలీలు దొరకడం లేదట..! కొన్ని చోట్లైతే పత్తి పండించిన రైతు కూడా జిందాబాదులు కొడుతూ తిరుగుతున్నారంట పార్టీల చుట్టూ పార్టీలు చేసుకుంటు…. పత్తిని ఆగం చేసుకుంటూ…!!