మొన్నటి దాకా జిల్లా అధ్యక్షుడిగా చేసిన తనకు కనీస గౌరవం లేదని అలకపాన్పెక్కిన నేతకు బజ్జగింపుల పర్వం కరిగించింది. పిలిపించి మాట్లాడారు. గౌరవమైతే దొరికింది. పదవికి హామీ లేదు. అది వస్తదని నమ్మకమూ లేదు. కానీ ప్రస్తుతానికి లాస్ట్ బెంచ్‌కు పరిమితమైన నేత మళ్లీ మొదటి బెంచ్‌కు వచ్చాడు. మీడియా ముందు కనబడుతున్నారు. అది చాలు ఈ జీవితానికి అని ఆయన ఖుషీ ఖుషీగా ఉన్నాడు.
గంగారెడ్డికి ఇక గౌరవం దొరికింది… అని అంతా అనుకుంటున్నారు. మంతే మరి పదవులు తర్వాత.. ముందైతే గౌరవం ఇవ్వండి బై.. అది లేక చాలా మంది నారాజ్‌గా ఉన్నారు. ఆ లిస్టు ఇక్కడ చెప్పాలంటే చాలనే ఉంది. అలా అని అందరినీ ముందు వరసలోకి తీసుకురావడం కుదరదు బై… అర్థం చేసుకోవాలె. ఓపిక పట్టాలె. కాలం కలసిరాకపోతే కాలం చేసేదాకానైనా ఆగాలె. అంతే గానీ అలకపాన్పెక్కుతా.. అలిగి కూసుంటా.. అజ్జాతంలో ఉండిపోతా… అని అంటే ఏదో ఒక్కసారి బతిమాలాడారు.. మాటిమాటికీ బతిమిలాడతారా..? ఏదో సీఎం ప్రోగ్రాం ఉంది కదా అని నీకు కలిసొచ్చింది గంగన్నా.. ఇంక చిటికీమాటికీ అలగకు.. వాళ్లు ఏ పదవీ ఇయ్యకపోయినా సరే కామ్ గా ఉండు. కామూష్‌గా ఉండు. మొదటి బెంచ్‌లో కూసుబెడుతున్నరు కదా.. అది చాలదా నీకు… అంతే సరిపెట్టుకో…..