ఆర్మూర్ నియోజకవర్గం పేరు ఎప్పుడూ ఏదో విధంగా తెరపైకి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది వార్తల్లో ఉండే నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పై కల్లెడ బీజేపీ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ హత్యాయత్నాకి ఒడిగట్టాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడిదే హాట్ టాపిక్. కలకలం రేపుతున్న వార్త. గత ఎన్నికల్లో జీవన్‌రెడ్డి మీద పోటీ చేసిన తలారి సత్యం అనే దళిత యువకుడిని హత్య చేయించాడనే ఆరోపణలు ఎమ్మెల్యే ఎదుర్కున్నాడు. అప్పటి నుంచి ఇక్కడ హత్యా రాజకీయాలు, పగ, ప్రతీకార దాడులు కామన్‌గా ఎప్పుడో ఒకసారి వినిపిస్తూనే ఉంటాయి. మాక్లూర్ మండల సాక్షి రిపోర్టర్ పోశెట్టిపై ఎమ్మెల్యే అనుచరులు మర్డర్ ప్లాన్ చేశారనే ఆరోపణ ఉండనే ఉంది. ఇదింకా సద్దుమనగలేదు.
ఈ క్రమంలోనే జీవన్‌రెడ్డికి నిజామాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. కానీ ఆయన తన నియోజకవర్గానికే పరిమితమవుతూ వస్తున్నాడు. తాజాగా ఈ హత్యాయత్నం సంఘటనతో ఆర్మూర్ మర్డర్ పాలిటిక్స్ మరోమారు తెరపైకి వచ్చింది. ఈనియోజకవర్గంలోనే ఓ మాజీ జడ్పీటీసీ పీర్‌సింగ్ తమ్ముడి భార్యను పగతో హెల్త్ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం ఊడబెరికించేశారు ఇక్కడి టీఆరెస్ నేతలు .. అనే ఆరోపణ ఉంది.