మైనార్టీలకు పబ్బుల్లో ప్రవేశం. అశ్లీల నృత్యాలు, విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం.. మందు, మగువ, తైతక్కలు. ఇవిప్పుడు హైదరాబాద్‌లో కామన్. మొన్నటి ఆమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ ఉదంతం పబ్‌లోని గబ్బు, గలీజు వ్యవహారాలకు సాక్షీభూతంగా నిలిచింది. అయితే ఇదంతా కొన్ని రోజులే. మళ్లీ పరిస్థితులు మామూలే. కంచె చేను మేస్తే.. అన్నట్టు ఈ పబ్బులకు ఊతం, బలం, అండ అంతా వెనుకుండి నడిపించే కొంత మంది పోలీసులంటే అవాక్కవాల్సింది. ఔను.. ఇది నిజం. చెప్పేవి నీతులు…. ఆ తర్వాత వీరే మందేసి మగువలతో తైతక్కలాడుతారు. ఇదీ హైదరాబాద్‌లో కొంత మంది పోలీసుల నీతిమాలిన చర్యలు.
మాదాపూర్ డివిజన్ లోని ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ (8 నెలల క్రితం బదిలీపై వచ్చాడు) హైటెక్ సిటీలోని నోవాటెల్ లో గల ఆర్టిస్ట్ పబ్ లో దోస్తులతో ఎంజాయ్ చేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మద్యం సేవించిన సీఐ మగువలతో డ్యాన్స్ చేసిన సంఘటనపై పలువురు విస్తుపోతున్నారు.
పబ్ లలో సిసి కెమెరాలు ఉన్నప్పటికీ ఈ అధికారి దోస్తులతో వెళ్లి ఎంజాయ్ చేయడం వెనుక ఈ లోకల్ పోలీస్ అధికారికి ఓ ఉన్నతాధికారి అండ ఉందని చెప్పుకుంటున్నారు.
పైన మనోడుంటే .. కింద ఇలాంటి గబ్బు, గలీజు దందాలెన్నైనా చేయొచ్చు… నీతులు చెప్పిన నోటితోనే పూటుగా మందు తాగి మగువులతో చిందులేయచ్చు… బేడీలేసిన చేతులతోనే క్యాబరే డ్యాన్సులు చేయొచ్చు. కేసులు పెట్టిన ఆ ఖాకీలే … ఆ బట్టలిప్పేస్తే తామూ ఓ జల్సారాయుళ్లమని, తాగితే ఎవరికీ ఏం తీసిపోమనీ చెప్పగలరు. ఇలా… మాదాపూర్ డివిజన్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌లా.
పబ్ ల వల్ల క్రైమ్ రేట్ పెరుగుతుందని హైదరాబాద్ సిపీ ఆనంద్ సీరియస్ గా ఉంటారు. కఠినంగా వ్యవహరిస్తామంటారు. కానీ ఆ ఖాకీవనంలోని ఈ సీఐ మాత్రం పబ్ లకు వెళ్లి తందనాలాడుతాడు. ఇదిప్పుడు చర్చనీయాంశమైంది.
పబ్‌లలో సీసీ కెమెరాలు పరిశీలిస్తే మన ఖకీల గట్టు రట్టవుతుంది. జల్సా రాయుళ్ల అసలు రూపం కళ్లకు కరోఠంగా కనిపిస్తుంది. యూనిఫాం ముసుగులో వేస్తున్న అసహ్యం గొలిపే యూజ్‌లెస్ పనులన్నీ ప్రపంచానికి కనిపిస్తాయి.

మాదాపూర్ డివిజన్ లోనే ఎక్కువ…
————————————
హైదరాబాద్ నగరం మాధాపూర్ డివిజన్ లొనే పబ్ లు అధికంగా ఉన్నాయి.
ధనవంతులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతాలలోని యువతను టార్గెట్ చేసుకొని పబ్ లు యువతను మత్తు పదార్థాలకు, విదేశి సంస్కతికి బానిసలుగా మార్చుతున్నాయి. ఈ సంస్కృతి విస్తరించడానికి మాదాపూర్ డివిజన్ లోని పబ్ లు ప్రయత్నిస్తున్నాయి.
అప్పుడప్పుడు పబ్ లపై పోలీసులు దాడులు చేసి నిర్వహకులను అరెస్టు చేసిన కొందరు పోలీసు అధికారుల సహాయంతో పబ్ లలో నిబంధనలు గాలికి వదిలి వేస్తున్నారు. మైనర్ లకు ఎంట్రీ కల్పిస్తూ క్రైమ్ పెరగడానికి కారణమవుతున్నారు.
హైదరాబాద్ నగరం మాదాపూర్ డివిజన్ లోనే అశ్లీల నృత్యాలు, మైనర్ లకు అనుమతి ఇవ్వడం వల్లే మద్యం సేవించిన మత్తులో లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.
టకీల పబ్ లో అశ్లీల నృత్యాలు… అమెనేషియా పబ్ నుంచి బాలికను తీసుకెళ్లి ఐదుగురు రేప్ చేయడం.. పబ్ లలో అభ్యంతరకర డ్యాన్స్ లు. ఇవన్నీ లోకల్ పోలీసు అధికారుల సహాయంతోనే జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం ఉంది.
పబ్ లలో నిబంధనలకు నీళ్లు..
లోకల్ పోలీసు అదికారుల సహాయంతో..
——————–
మాదాపూర్ డివిజన్ల డిజెల సౌండ్… అభ్యంత కర దృశ్యాలతో డాన్సులు కొనసాగుతున్నాయి. ధనవంతుల పిల్లలను టార్గెట్ చేసుకొని అమ్మాయిలను ఎర వేస్తున్నారు.
ఎంజాయ్ పేరిట పబ్ లలో నేరాలకు పాల్పడుతున్నారు. చదువుకునే వయస్సులో మైనార్టీ తీరక ముందే చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు.
పోలీసు అధికారుల సహాయం తోనే నిబంధనలకు విరుద్దంగా కోనసాగుతున్నాయి.
అమ్నేషియా పబ్ నుంచి…
———–————————-
ఇటీవల అమెనేషియా పబ్ కు వచ్చిన అమ్మాయిని వెంట తీసుకెళ్లిన ఐదుగురు అత్యాచారానికి పాల్పడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు గురించి సోషల్ మీడియాలో పోలీసు అధికారుల తీరును తపు పట్టారు. ఈ కేసులో ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజరులుగా గుర్తించి అరెస్ట్ చేసారు. ఈ కేస్ కు సంబంధించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.
మాదాపూర్ డివిజన్ లోని పబ్ లో ఓ పోలీస్ అధికారి ఎంజాయ్…
————————————–
టకి పబ్ లో అశ్లీల నృత్యాలు.. అమెనేషియా పబ్ నుంచి బాలిక అపహరణ.. మస్తీ పబ్ లో అభ్యంతకర నృత్యాలు -. నిబంధలకు విరుద్దంగా జరిగే పబ్ లపై చర్యలు తీసు కోవాల్సింది లోకల్ పోలీస్ అధికారులే..
– ఉదయ శ్రీ
