పెతోడికి ఫ్యాషన్ అయిపోయింది ఇండియా ని శ్రీ లంక తో పోల్చటం, శ్రీ లంక ఉచిత పథకాల వలన సంక నాకిపోలేదు (ఎనీ వే, నేను ఉచిత పథకాలకి వ్యతిరేకమే). కొంతమంది అయితే రాష్ట్రాలని కూడా శ్రీ లంక తో పోల్చుతున్నారు.

మొదట గా తెలుసుకోవాల్సింది శ్రీ లంక చాలా నీట్ గా ఉంటుంది. అదొక ద్వీపం. జనాభా 2 కోట్లు మాత్రమే. సహజ వనరలు చాలా తక్కువ.

ప్రధాన ఆదాయం పర్యాటక రంగం (టూరిజం), ఆ తర్వాత తేయాకు. కరోనా పాండెమిక్ వలన టూరిజం దెబ్బతింది, ఆర్గానిక్ వ్యవసాయం అనటం వలన ఉత్పత్తి తగ్గింది. ఈ విధం గా రెండూ సంక నాకిపోయి….మిగతా సమస్యలు మొదలయ్యాయి.

ఇండియా జనాభా 140 కోట్లు, మన ఆదాయ వనరులు వేరు, మన కథా కమీషు వేరు, మన ఎక్స్ పోర్ట్స్, ఇంపోర్ట్స్ వేరు.

ఇండియా ఇండియా నే, శ్రీ లంక శ్రీ లంక నే; ఇండియా సమస్యలని శ్రీ లంక సమస్యలతో పోల్చటం మరియూ రాష్ట్రాలని శ్రీ లంక తో పోల్చటం కరక్ట్ కాదు అని నా అభిప్రాయం.

Jagannadh Goud

 

You missed