నిఖత్ జరీన్ విజయం తెలంగాణ కే గర్వ కారణం
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం హర్షణీయం.
జరీన్ ఘన విజయంతో తెలంగాణ, నిజమాబాద్ జిల్లా కీర్తి ప్రతిష్టలు, ప్రపంచం నలుదిశలా మరింతగా వ్యాపించనున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం క్రీడలు,క్రీడాకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని,ప్రోత్సహిస్తున్నది చెప్పడానికి జరీన్ విజయమే అందుకు నిదర్శనం.
నిజామాబాద్ జిల్లాకే గర్వకారణం మైన జరీన్ కు వ్యక్తిగతంగా లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకం అందిస్తా.
రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా నిఖత్ జరీనాకు అన్ని రకాల సహాయ సహకారాలు,ప్రోత్సాహం అందేలా చొరవ తీసుకుంటా..
జరీన్ కు, ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, జిల్లా ప్రజలకు బాక్సింగ్ అసోసియేషన్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు.
– వేముల ప్రశాంత్ రెడ్డి👆🏻
రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి
