గా రేవ్ పార్టీలో నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు.. నా కొడుకు సత్తెపూస.. అసలు డ్రగ్స్ వాసనే తెల్వదు. నా బిడ్డకు అస్సలు ఆ పార్టీలతో ఆ డ్రగ్స్‌తో స0బంధం లేదు.. మీ మీదొట్టు….
అడ్డంగా దొరికినా.. ఇంకా వెనుకేసుకొచ్చే తండ్రులకుఈ వీడియో అంకితం. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్టు చిన్నప్పట్నుంచి అడిగింది కొనచ్చి.. గార్వం చేసి.. అడ్డ గాడిదలా పెంచి ఆగం చేసి బజార్లోకి పంపితే ఇగో ఇలా అర్థరాత్రులూ పబ్‌లు రేవ్ పార్టీలని మందేసి.. చిందేసి .. డ్రగ్స్‌కు అలవాటై చిత్తైపోతరు. ఆఖరికి ఏదో ఒక రోజు ఇలా బయట పడి బుక్కై .. తలెత్తుకోలేక చితికి తెరమరుగైపోతరు.
నజీర్ మహ్మద్ వాల్‌పై ఈ వీడియో కనిపించింది. గంజాయికి అలవాటు పడిన తన కొడుకును స్తంభానికి కట్టేసి కళ్లలో కారం పొడి పోసి దంచింది. అంతే మరి ఇదే కరెక్టు ట్రీట్మెంట్. ఇలా చేసేదెందరు..? మావోడు బంగారమని వెనుకేసుకేసుకొచ్చే తల్లదండ్రులున్న కాలంలో ఈ తల్లి ట్రీట్మెంట్ సెపరేట్. డ్రగ్స్ కు అలవాటు పడ్డ కొడుకులకే కాదు.. వారిని వెనుకేసుకొచ్చే తండ్రులకై ఇదే ట్రీట్మెంట్ ఇస్తే సరి….
ఇగో ఇదీ ఆ వీడియో లింక్… https://www.facebook.com/100003960280522/posts/2382017518606901/
