ఎవరేమన్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుద్ద నేరస్థుడు. తన దేశ ప్రజల్ని, సైన్యాన్ని మృత్యు కుహరం లోకి నెట్టిన విఫల నాయకుడు. అమెరికా, నాటో మాటలు నమ్మి, తమ వాస్తవ బలాన్ని విస్మరించి ప్రవర్తిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. లేని బలాన్ని ఊహించుకుని, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఊహల్లో తేలితే సంభవించిన ఫలితమిది. గతంలో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘించి, నాటో లో చేరి, అమెరికా, దాని తైనాతీ దేశాల సైన్యాన్ని తెచ్చి రష్యా పక్కలో బల్లెంలా మార్చాలను కోవడం, రష్యా కు సముద్ర తీరమే లేకుండా చెయ్యాలని ప్రయత్నించడం వంటి చర్యలు రష్యా చూస్తూ ఊరుకుంటుందని ఎలా అనుకుంటారు. ఇప్పుడేమో ఒక బలహీన దేశం మీద నియంత దాడి చేశాడని వగవడం సబబేనా!

యుద్ధం విధ్వంసాన్నే మిగులుస్తుంది. సందేహంలేదు.సామాన్యుల జీవితాల్ని దుర్భరం చేస్తుంది. దాన్ని ఎవరూ ఆహ్వానించ లేరు. ఆహ్వానించ కూడదు కూడా. అలా అని శత్రు మూకతో కలిసి తమ మనుగడకే ప్రమాదం కొని తెస్తే ఊరుకోవడం సాధ్యమా!

ఉక్రెయిన్ సాధారణ ప్రజల ప్రస్తుత కష్ట నష్టాలకు జెలెన్స్కీ ప్రధాన భాద్యుడు. అతనితో పాటు అమెరికా, యూరోపియన్ యూనియన్, నాటో దేశాలు బాధ్యులు. నిందించాల్సింది వాళ్ళనే కానీ పుతిన్ నో, రష్యానో కాదు. అలా అని అన్ని విషయాల్లో పుతిన్ ను, రష్యాను సమర్ధించనక్కర లేదు.

అలాగే ఇప్పుడు బలహీనులపై బలవంతుల దాడి అంటూ వగస్తున్న మీడియా, ఇతరులు ఇదే వగపు అమెరికా వియత్నాం మీద, లిబియా మీద, ఇరాక్ మీద దాడి చేసినప్పుడు, స్లోవేకియా ను వేరు చేసినప్పుడు, పాలస్తీనా ను తొక్కేస్తున ఇజ్రాయిల్ కు తాన తందాన అన్నప్పుడు, ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలుగొందడం కోసం చేసిన అనేకానేక అనర్థాల సందర్భాల్లో ఈ గొంతులు ఏ మేరకు పెగిలాయి? అమెరికా దాడులు చేస్తే ప్రజల విముక్తి కోసం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం, ప్రజాస్వామ్య ఉద్ధరణ కోసం. అదే పని వేరే వారు చేస్తే అది దురాక్రమణ.

ఈ నీతిని, రీతిని సమర్ధిద్దామా!

-వి.ఆర్. తూములూరి.

(Copied From:
Hethuvadhi WhatsApp..)
— Rajeshwer Chelimela

You missed