హైదరాబాద్‌కు ప్రధాని మోడీ రాక సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి, ఇక్కడ కేసీఆర్‌కు మధ్య పే..ద్ద అగాథం ఏర్పడిన నేపథ్యంలో మోడీ రాక ప్రాధాన్యత సంతరించుకున్నది. మొదటి నుంచి ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వెళ్తాడా ..? వెళ్లడా..? అనే చర్చ అన్ని సర్కిళ్లలో జోరుగా సాగుతున్నది. ఈ రోజు పీఎం మోడీ హైదరాబాద్‌లో కాలు మోపే వరకు సస్సెన్స్ కొనసాగుతూనే ఉంది. మొదట శ్రీనివాస్ యాదవ్ పీఎంను రిసీవ్ చేసుకుంటారని ప్రకటన జారీ చేశారు. ఆ తర్వాత అది లాంఛనమే. సీఎం హాజరవుతున్నారని అన్నారు.
చివరకు … ఆఖరి క్షణానికి సీఎం కేసీఆర్‌కు జ్వరం అని ప్రకటించారు. ఆయన పీఎం స్వాగత కార్యక్రమానికి హాజరుకావడం లేదని, కానీ చినజీయర్ ఆశ్రమంలో జరిగే కార్యక్రమానికి మాత్రం హాజరవుతారని ప్రకటించారు. ఈ పరిణామలు పీఎంకు, సీఎంకు మధ్య పెద్ద అగాథమే నెలకొన్నదనే సంకేతాలు వస్తున్నాయి. కాగా పీకే ఆదేశాల మేరకే సీఎం కేసీఆర్ నడుచుకుంటున్నాడా..? పీఎం స్వాగత కార్యక్రమానికి అందుకే హాజరు కాలేకపోతున్నట్టు ప్రకటించారా..? చివరాఖరు క్షణంలో కేసీఆర్‌కు జ్వరం అనే ఆలోచన ఎవరిది..? ఎందుకు ఇంత డ్రామా..?
ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. పీఎం రాక ఇక్కడ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. అంతా ఆసక్తిగా ఈ విషయాన్ని గమనిస్తున్నారు.