విలేక‌రులు అడిగిన ఓ ప్ర‌శ్న‌కు సీఎం కేసీఆర్ స‌మాధాన‌మిచ్చాడు. యూపీ ఎన్నిక‌ల్లో మీరు బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తారా..? అని. ఈ ఎన్నిక‌లు రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రెఫ‌రండం కాద‌న్న కేసీఆర్‌.. బీజేపీకి సీట్లు త‌గ్గుతాయ‌న్నాడు. గ్రాఫ్ ప‌డిపోతుంద‌న్నాడు. కానీ ఓడిపోతుంద‌ని చెప్ప‌లేదు. యూపీ బీజేపీ ఖాతాలోనే ప‌డుతుంద‌ని ప‌రోక్షంగా ఆయ‌న ఒప్పుకున్న‌ట్టైంది. తెలంగాణ‌లో త‌మ సీట్లు పెరుగుతూ వ‌చ్చాయ‌ని, జ‌నాధ‌ర‌ణ పెరుగింద‌ని … కానీ యూపీలో మాత్రం బీజేపీకి గ్రాఫ్ ప‌డిపోతుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చాడు. ఇది సెమిఫైన‌లేం కాదు.. ఎవ‌రైనా గెల‌వొచ్చు.. గెలిస్తే మాత్రం గొప్ప‌నా..? బీజేపీకి ఈసారి సీట్లు మాత్రం త‌గ్గుత‌య్‌… గ్రాఫ్ త‌గ్గుతుంది.. అని చెప్పాడే త‌ప్ప ఓడిపోబోతుంద‌ని మాత్రం సీఎం కేసీఆర్ చెప్ప‌లేక‌పోయాడు. ఈ మాట‌ల్లో అంత‌రార్థం ఏమిటీ…? యూపీలో బీజేపీ గెల‌వ‌నుందా..? ఇప్పు్డు ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది…

You missed