ఆ టైమ్ సెన్సే ఆయ‌న్ను ఇంతెత్తున నిల‌బెట్టింది.

క్ర‌మ‌శిక్ష‌ణ‌, అకుంఠిత దీక్ష‌, ప‌ట్టుద‌ల … ఇవ‌న్నీ మ‌నిషిని ఎప్పుడో ఒక‌ప్పుడు ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుస్తాయి. క‌ష్టాల‌ను, బాధ‌ల‌ను అధిగ‌మించే మ‌నోధైర్యాన్నిస్తాయి. ఆత్మ‌విశ్వాసాన్ని ప్రోదీ చేస్తాయి. అలాంటి మ‌నోనిబ్బ‌రం, ప‌ట్టుద‌ల క‌లిగిన ఓ సాధార‌ణ వ్య‌క్తే సూప‌ర్‌స్టార్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌. సినిమాల‌కు ప‌నికొచ్చే ముఖ‌మే త‌నది కాద‌ని గెంటివేత‌కు గురై అవ‌మానింప ఆ ముఖమే ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం కీర్తిస్తున్న‌ది. అంత‌టి కీర్తి గ‌డించిన బిగ్‌బీ అమితాబ్‌… జీవితం ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు… కెర‌టం ఆయ‌న‌కు ఆద‌ర్శం. ఎందుకంటే అది ప‌డినా లేస్తుంది కాబ‌ట్టి. హీరోగా ఓ వెలుగు వెలిగిన త‌ర్వాత కూడా బిగ్‌బీ జీవితంలో చీక‌ట్లు అలుముకున్నాయి. అయినా ఆయ‌న క్రుంగిపోలేదు. జీవితంలో ఓడిపోలేదు. కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి గేమ్ షోతో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అప్పుల ఊబి నుంచి బ‌య‌ట‌ప‌డి… మ‌ళ్లీ త‌నే కొత్త‌గా ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఎవ‌రూ అంద‌నంత‌గా.. మ‌రెవ‌రూ ఊహించ‌నంత‌గా. కానీ ఆయ‌న ఇప్ప‌టికీ ఒదిగే ఉంటాడు. ఎదుగుతూనే ఉంటాడు. ఇగో ఆయ‌న ఎదుగుద‌ల‌లో ఈ టైమ్ సెన్సూ ప్ర‌ధాన‌మే. కాదంటారా?

You missed