అఖండ విజయం అంటే ఇది..సాహసం అంటే ఇది.సినిమాల్లో పులులను సింహాలను ఎదుర్కోవడం కాదు…చిరుతకే వణుకు పుట్టించిన ఈ ‘ టైగర్ మదర్ ‘ గురించి విన్నారా..
మధ్యప్రదేశ్ లోని శిధి ప్రాంతంలో బైగా తెగకు చెందిన మహిళ కిరణ్.సాయంత్రం ఒడిలో ఆరునెలల పసిబిడ్డతో , ఇంకో ఆరేళ్ళ కొడుకు రాహుల్ తో పనికి వెళ్ళిన భర్త కోసం ఎదురుచూస్తూ తమ గుడిసె ముందు కూర్చుని ఉంది.ఇంతలో చెట్టు చాటున నక్కి ఉన్న చిరుత పులి ఒక్కసారిగా ఆరేళ్ళ పిల్లవాడిని నోటకరుచుకుని పొదల్లోనుండి ప్రక్కనే ఉన్న అడవిలోకి పరుగు తీసింది.
కిరణ్ చిన్న బిడ్డను పక్కింటి వాళ్ళకిచ్చి పులి వెంట పరుగు తీసింది.దాదాపు రెండు కిలోమీటర్లు తన బిడ్డ కోసం పులిని వెంబడించింది.
చీకట్లు ముసరడంతో ఎక్కడా పులి జాడ లేకున్నా అడవిలోపలికి వెళ్ళింది. ఎత్తైన స్థలం లో తన బిడ్డ కేకలు వినిపించడంతో కర్రలతో రాళ్ళతో పులిమీదకు ఎగబడింది కిరణ్.పులి తనమీదకు వచ్చినా చలించలేదు.రాళ్ళతో చిరుతనే ఎదుర్కొంది.ఈలోగా గ్రామస్థులు అందరూ అక్కడికి పరుగులు పెడ్తూ రావడం గమనించిన చిరుత బిడ్డను వదిలి పారిపోయింది.
అక్కడి గ్రామస్తులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అధికారులు కిరణ్ ను రాహుల్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఆ తల్లి కళ్ళలో ఏమైనా సరే తన బిడ్డను కాపాడుకోవాలనే పట్టుదలను , నిర్భీతిని చూసి పులి అవాక్కై ఉంటుంది.Hats off Kiran..
Mother ‘ s power is Supreme.
Rajitha Kommu