సోషల్ మీడియా యుగం. పత్రికల్లో పనిచేసే మిత్రుల్లో చాలా మంది కొత్త పీడీఎఫ్ ఎడిషన్ లు, వెబ్ సైట్ల నిర్వహణ లో తలమునకలైనారు. చేతిలో స్మార్ట్ ఫోన్.. కార్యక్రమానికెళ్ళడం.. అక్కడే వార్త కొట్టడం. వెబ్ డిజైనింగ్ ఐడియా ఉంటే వెంటనే అప్ లోడ్ చెయ్యడం, ఆ వెంటనే తమ వార్తను సర్క్యులేట్ చెయ్యడం…

నగరాలనుంచి, చిన్న పట్టణాలు, మండలాలకు కూడా ఈ సంస్కృతి పాకింది. గ్రామీణ విలేఖరులు ఈ పరిధిలోకి వచ్చినట్టు ఈ మూడు నాలుగురోజుల నా అనుబంధం తెలిపింది. చాలా మంది పెద్ద పత్రికల్లో చేసిన మిత్రులు ఇప్పుడు మళ్ళీ చిన్న పత్రికలు నిర్వహించుకోవాల్సిన స్థితిలో ఈ కొత్త అలవాటులో భాగమయ్యారు.
ఎప్పుడు చూసినా ఆ మిత్రులంతా నిరంతర శ్రామికుల్లా పని.

ఓ అర్థరాత్రి హఠాత్తుగా టింగుమని సౌండ్ వస్తే చూసేసరికి ఓ మిత్రుని పత్రిక పీడీ ఎఫ్ నా వాట్సప్ గ్రూపులో..ఎందుకో చాలా బాధ కలుగుతున్నది.. ఈ ఘడియ రికామ్ లేని పనిలో గవ్వ రాకడ ఉండదు కదా.

అయినా పాతాళ గరిగె కు కూడా తాకని బొక్కెనలా ఇరవై గోలల లోతు పడిపోయిన తర్వాత ఇంకెలా బయట పడగలం?…

పత్రికలనూ, పాత్రికేయులనూ అవసరార్థమయినా గుర్తించాల్సిన ఆగత్యమున్న నాయకులకు కూడా ఇప్పుడు చాయ నీళ్ళు మాత్రమే పొయ్యగలిగే స్థాయిలో జర్నలిజం కొత్త కత్తు.. కొత్త మీడియా ఔత్సాహిక జర్నలిస్టులు…

మళ్ళీ మళ్ళీ వేడుకోగలిగే ఒక విన్నపం..మిత్రులూ రికామ్ లేకున్నా గవ్వ వచ్చే రీతిలో శ్రమిద్దాం.మనకోసం కాకున్నా మన పిల్లల కోసం.

P V Kondal Rao

You missed