ఆర్మూర్ నియోజకవర్గం నుంచి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పోటీచేయనున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసున్నాడు. ఆర్మూర్‌లో ఓ ఆఫీసు, ఇళ్లును అద్దెకు తీసుకుని అక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. ఇక్కడ మున్నూరు కాపులు ఎక్కువగా ఉండటం, పసుపు బోర్డు హామీకి సంబంధించిన ఇష్యూ ఇక్కడి రైతులకు ఎక్కువగా సంబంధం లేకపోవడం అర్వింద్‌కుక కలిసి వచ్చే అంశం. ఇప్పటికే చాప కింద నీరులా మెల్లగా తన కార్యకలాపాలు విస్తరిస్తున్నాడు అర్వింద్.
మొన్న నందిపేట్ మండలంలో బీజేపీ వాళ్లతో డుబల్ బెడ్ రూం ఇండ్ల గురించి నిరాహార దీక్షచేయించి రచ్చ రచ్చచేయించాడు. ఆఖరికి ఈ బాధ తట్టుకోలేక జీవన్‌రెడ్డి వారిని హైదరాబాద్‌కు పిలిపించి ఉన్నపళంగా కొన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు ఓ ప్రొసీడింగ్ కాపీని వారి చేతికొచ్చి పంపించేశాడు. దసరా తర్వాత పనులు కూడా మొదలు పెడతానన్నాడు. ఇప్పుడు ఈ పండుగ అయిన తర్వాత దీనిపై మళ్లీఆందోళనకు సిద్దమయ్యేందుకు రెడీగా ఉన్నారు వాళ్లు.
ఇదిలా ఉంటే అర్వింద్‌కు ధీటుగా పసుపుబోర్డు సంగతి ఏమైంది అంటూ కొంత మంది జీనన్‌రెడ్డి కూడా ఆందోళన చేయించాడు. ఇలా పోటాపోటీగా ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. అవకశం వచ్చినా రాకున్నా ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. మొన్నటి వరకు ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ప్రొద్దుటూరి వినయ్‌రెడ్డిని కాదని అర్విందే పోటీ చేసేందుకు రంగం రెడీ చేసుకుంటున్నాడు.
ఈ విషయం జీవన్‌రెడ్డికి తెలిసింది. వచ్చే సారి టికెట్ వస్తుందో లేదో తెలియదు. కానీ తన ప్రత్యర్థి మాత్రం చాలా బలంగా ఉన్నాడనే విషయాన్ని జీవన్‌రెడ్డి గమనంలోకి తీసుకున్నాడు. అందుకే ముప్పేట దాడికి శ్రీకారం చుట్టాడు. మాటల శరపరంపరలు పెంచాడు. ఏ అవకాశం వచ్చినా వదలడం లేదు. ఆఖరికి దుబాయ్ వెళ్లి కూడా అర్వింద్‌నే కలవరిస్తున్నాడు. మాటల దాడులు చేస్తున్నాడు. రా చూసుకుందాం.. అని ఆర్మూర్ వేదికగా పోటీ చేయాలని పిలుపునిచ్చినట్టు మాట్లాడాడు. అతని మనసులోని మాటే చెప్పాడు.
రానున్న రోజుల్లో అర్వింద్ ఆర్మూర్ నుంచే పోటీ చేయనున్నాడు.ఇది జీవన్‌రెడ్డికి మింగుడుపడటం లేదు. అందుకే ఇప్పటి నుంచే కట్టడి చేసేందుకే… మాటల యుద్ధాన్ని ప్రకటించాడు.