“మందుబాబులం, మేం మందుబాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం” అని తాగుబోతుతనాన్ని,
“మదిలో, వొడిలో, గుడిలో, బడిలో.. అంగాంగ తేజ శృంగార భావం” ఆడపిల్లలో చూసే మగవాడి దృష్టిని,
“ప్రతి ఆడపిల్ల మగవాడికి పడాల్సిందే” అని ఆడపిల్లమీద హక్కుల్ని మగజాతికి ధారాదత్తం చేసిన చేసి
ఇట్లా ఆడపిల్లల మీద అత్యాచారాలకి తర్వాత హత్యలకు కారణమైన సినిమాలు తీసి డబ్బు సంపాదించుకునే నీలాంటి వెధవలకు ముందు శిక్ష వేయాలి. అట్లాంటి నువ్వు, మనుషులు, వాళ్ల హక్కులమీద మాట్లాడడం, ఏకంగా మానవ హక్కుల కార్యకర్తల మీద మాట్లాడడం ఈ తెలుగు జాతి చేసుకున్న దౌర్భాగ్యం.
కిందికులాల జనాల్ని కరుడుగట్టిన రౌడీలుగా గూండాలుగా చూపి వాల్మీకులుగా ప్రకటించిన చోటనే;
సొంత కులస్తులు మాత్రం పైకి కులవృత్తి చేస్తూ, లోపల సమాజోద్ధారకులుగా “దువ్వాడ జగన్నాధాలు”గా ప్రకటించే నీలాంటివాళ్ళు కులాలని బట్టి తీర్పులు, శిక్షలు కావాలని కోరడమ్మీద, స్త్రీ బలహీనతలని, మగాధిపత్యాల్ని ప్రచారం చేసే అసలైన నీలాంటి నేరస్తులను వదిలేయడమ్మీద నిరసన తప్ప
ఈ హక్కులవాదులు లేకపోతే ఈ జాతికి స్వాతంత్ర్యం వుండేదికాదు, రాజ్యాంగం వుండేది కాదు, అందాకా ఎందుకు నువ్వింత ధైర్యంగా వెధవ నీతులు చెప్పే హక్కుండేది కాదు.
– Siddharthi Subhas Chandrabose
