పోరాడితే పోయేదేమీ లేదు.. సమస్యల పరిష్కారం తప్ప. అలాగే అనిపిస్తుంది ఇక్కడ జరిగిన సీన్ చూస్తే. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని తల్వెద గ్రామ వాసులు తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కావాలని తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తన్నారు. ఈ దీక్ష దెబ్బకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దిగొచ్చాడు. ఓ బస్సులో ఈ రోజు అందరినీ హైదరాబాద్‌కు పిలిపించుకున్నాడు. 70 డబుల్ బెడ్ రూం ఇండ్లు సాంక్షన్ చేస్తున్నట్టు జీవో కాపీ చేతుల పెట్టి పంపించాడు. ఇంతటితో కథ ఒడిసిందనుకున్నాడు.
కానీ వాళ్లు ఎమ్మెల్యేకు థ్యాంక్స్ చెబుతూనే.. అప్పుడే పోరాటం ఆపేది లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం దసరా దాకా టైమ్ ఇచ్చారు. ఆ తర్వాత దీనిపై పురోగతి లేకుంటే.. మళ్లీ ఉద్యమమే అని అల్టిమేటం జారీ చేశారు. పాపం.. మంజూరైన చోటే ఇప్పటికీ దిక్కలేదు. కట్టిన ఇండ్లు పడావుగా పడి ఉన్నాయి. లబ్దిదారుల ఎంపిక తలకు మించి భారంగా మారింది ప్రజాప్రతినిధులకు. ఈ తల్వెదలో మాత్రం ఇప్పుడప్పుడే కట్టిస్తారా? ఏమో చూడాలి. పోరాటమైతే చేస్తామంటున్నారు కాబట్టి… త్వరగా చేస్తారేమో. ఇలా అందరూ ఈ డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం పోరాడితే… త్వర త్వరగా పూర్తయి.. పూర్తయినవి గృహ ప్రవేశాలై… అసలు మంజూరే లేని చోట మంజూరై……… మరి ఇంకెన్ని రోజులు ఓపిక పడతరు బై….