(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఆయ‌న సీనియ‌ర్ లీడ‌ర్‌. మాజీ మంత్రి. త‌న‌కు తాను నీళ్ల నిరంజ‌న్‌రెడ్డిగా నామ‌క‌ర‌ణం చేసుకున్నాడు. కానీ నోటిదూల నిరంజ‌న్‌రెడ్డిగా పేరుగాంచాడు. క‌విత ఆయ‌న‌పై విరుచుకుప‌డింది. అవినీతి ఆరోప‌ణ‌లు చేసింది. పుచ్చు వంకాయ అని త‌న‌ను సంబోధించినందుకు త‌నూ అదే స్థాయిలో పుచ్చ ప‌గ‌లుతుంది..అని వార్నింగ్ ఇచ్చింది. దీనికి ఆ పెద్ద మ‌నిషి హుందాగా స‌మాధానం చెప్పాలింది. కానీ అదే దొర దుర‌హంకారం, నోటి దూల‌తోనే జవాబిచ్చాడు. లిక్క‌ర్ రాణి అన్నాడు. ఈ మాట‌నేందుకు అత‌డు సొంతంగా సాహించ‌డ‌నే అనుకోవాలి. కచ్చితంగా కేసీఆర్‌కు చెప్పో, కేటీఆర్ ప‌ర్మిష‌న్ తీసుకునే ఆ ప్రెస్‌మీట్ పెట్టి ఉంటాడు.

ఈ మాట‌లు అంటాన‌ని కూడా చెప్పి ఉంటాడు. నిజంగా వారు ప‌ర్మిష‌న్ ఇచ్చారా? క‌విత‌ను లిక్క‌ర్ రాణి అని తిట్ట‌మ‌ని. ఒక‌వేళ ఇస్తే.. నిజంగా ఢిల్లీ లిక్క‌ర్ స్కాం జ‌రిగింద‌ని ఆ కుటుంబం ఒప్పుకున్న‌ట్టేనా? ఎంతైనా బిడ్డెను అలా అన‌మ‌ని ఏ తండ్రైనా అంటాడా? మ‌రి అన్న కేటీఆర్ నుంచి నిరంజ‌న్‌రెడ్డికి ప‌ర్మిష‌న్ వ‌చ్చిందా..? ఇద్ద‌రూ ఇవ్వ‌క‌పోతే .. నిరంజ‌న్‌రెడ్డికి ఎన్ని గుండెలు అట్లా అనేందుకు. అంతే కాదు.. లంబాడి తండాల్లోకి వెళ్లినప్పుడు అక్కడ సారా కాసుకునే ఆ మ‌హిళ‌లు కూడా క‌విత చేస్తే త‌ప్పు కాదు… మేం చేస్తే త‌ప్పా? అని నిల‌దీశార‌ట పాపం.. ఇత‌గాడిని. ఆరోప‌ణ‌ల‌పై స్పందించ‌రా నాయ‌నా.. అంటే ఇలా చెప్పుకొచ్చాడు. హుందాత‌నం వ‌దిలాడు. నీకు మేమైనా అడ్డుప‌డుతున్నామా? అని డబల్ మీనింగ్ మాటొక‌టి. మ‌రి కామారెడ్డిలో కేసీఆర్‌ను ఎందుకు ఓడించార‌ని స‌మ‌ర్థింపు మ‌రొకటి.

అంత‌కు ముందు కూడ ష‌ర్మిళ‌ను మంగ‌ళారం మ‌ర‌ద‌ల‌ని నాలుక మ‌డ‌తెట్టిన విష‌యం కూడా ఈ సంద‌ర్భంగా మ‌ళ్లీ చ‌ర్చించుకుంటున్నారు జ‌నం. అదీ మ‌న నీళ్ల… కాదు కాదు నోటిదూల నిరంజ‌న్‌రెడ్డి తీరు.