వాస్తవం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

RTV ఎడిటర్ రవి ప్రకాశ్ వెల్లడించిన సర్వే ప్రకారం, జూబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు కనీసం 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు ఖాయమ‌ని చెబుతున్నాడు. రవి ప్రకాశ్ చేసిన సర్వేలు గత ఎన్నికల చరిత్రలో ఒక్కటీ తప్పిన దాఖలాలు లేవు. అందుకే ఈసారి కేటీఆర్‌, హరీష్ రావు తికమక పడి, పిచ్చిపనులు చేస్తున్నారన్నది స్పష్టం. ఎన్ని చేసినా ఫ‌లితం మాత్రం ఇలాగే ఉంటుంద‌ని స‌ర్వేల‌న్నీ చెబుతున్నాయి.

రవి ప్రకాశ్ అంచనాల ప్రకారం ఈసారి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు — కాంగ్రెస్ ఘన విజయం సాధించ‌బోతుంద‌నేది ఆ స‌ర్వే సారాంశం. ఈ ఫ‌లితాల త‌రువాత కేటీఆర్ రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏంటీ..? అనేది ఇప్ప‌ట్నుంచి డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కేటీఆర్ అరెస్టు ఖాయమంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. మాగంటి సునీత కూడా వాస్త‌వాలు తెలుసుకుని, త‌ప్పిదాలు స‌రిదిద్దుకునేందుకు డ్రామాలు ఆపి, మగంటి గోపీనాథ్ తల్లికి క్షమాపణ చెప్పాల‌నే డిమాండ్ కూడా వ‌స్తోంది. విచార‌ణ మొద‌లు పెడితే సునీత‌తో పాటు కేటీఆర్ ఇద్దరూ జైలు బాట పట్టడం తప్పదని అందరికీ స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడిదే రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.