వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై మొద‌టి నుంచి బీఆరెస్ పిల్లి మొగ్గ‌లు వేస్తూ వ‌స్తోంది. గెలుపు ధీమాను పైకి వ్య‌క్తం చేస్తూనే మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది. ఎన్ని చేయాలో అన్ని చేసింది. త‌ప్పుడు క‌థ‌నాలు వండి వార్చింది. బీఆరెస్ సోష‌ల్ మీడియాల‌ను ఎంత‌లా ఉప‌యోగించుకుని గ‌బ్బు ప‌ట్టియ్యాల్నో అంత ప‌ట్టించింది. సానుభూతి కోసం మాగంటి సునీత‌తో డ్రామా ప్లే చేసింది. ఎన్ని చేసినా.. బ‌ల‌వంతంగా బ‌ద్ద‌లు క‌ట్టిన‌ట్టే ఉంది కానీ, పార్టీ అక్క‌డ లేవ‌డం లేదు. ఓట్లు రాలే ప‌రిస్థితి మ‌రింత‌గా దిగ‌జారుతూ వ‌స్తోంది. ఇక పోలింగ్ రేపు అనంగ కూడా చివ‌ర అస్త్రంగా బీఆరెస్ సోష‌ల్ మీడియా ఓ వికార‌పు వీడియోను వ‌దిలింది.

అది… ఎక్క‌డిదో.. ఎప్ప‌టిదో… తెలియ‌దు. ఓట‌ర్ ఐడీల‌న్నీ ఒక్క చోట పంపిణీ కోసం పెట్టుకున్న వాటిని తీసిన వీడియో. ఆ వీడియోను చూపుతూ.. ఇవ‌న్నీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దొంగ వోట్లు వేసేందుకు సిద్దం చేసుకుంద‌ని, వీటిపై ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు హ‌రీశ్‌రావు ఫిర్యాదు చేశాడ‌నీ పేర్కొంటూ ట్విట్ట‌ర్‌లో ఓ ఫేక్ మీడియా పేరుతో రిలీజ్ చేసింది. దీన్ని వైర‌ల్ చేసింది. ఆ వీడియో చూస్తే ఎవ్వ‌రూ ఎవ్వ‌రూ న‌మ్మ‌శ‌క్యం లేదు. న‌మ్మ‌రు కూడా. ఎందుకంటే అవ‌న్నీ కొత్త‌గా ముద్రించిన ఓట‌ర్ ఐడీలుగా.. అధికారులు పంపిణీ కోసం సిద్దం చేసుకుని పెట్టుక‌న్న‌విగా ఉన్న‌ట్టే ఉన్నాయి. ఇంత‌లా గ‌లీజ్ ప‌నికి బీఆరెస్ ఎందుకు దిగ‌జారింది..? అంటే కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ .. సీఎం చెప్పినట్టుగా 30వేల ఓట్ల‌తో గెలివ‌నున్నాడ‌ని గ్ర‌హించేసిందా? అందుకే క‌నీసం ఇలాంటి ఫేక్ వార్త‌ల‌తో ఎన్నిక వాయిదా ప‌డాల‌ని బీఆరెస్ కోరుకుంటుందా? అదే అనిపిస్తుంది ఇలాంటి చీప్ ట్రిక్స్‌.. గ‌లీజ్ ఫేక్ వార్త‌ల దందా చూస్తుంటే.. అని అంతా అనుకుంటున్నారు.