వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
బీజేపీలో వాళ్లంతా ఫైర్ బ్రాండులు. బీఆరెస్‌పై భగ్గుమంటారు. కేసీఆర్‌ను ఆడుకుంటారు. కేటీఆర్‌ను ఎగెరేసి ఎగరేసి దంచుతారు తమ ప్రసంగాలతో. వాడియైన మాటలతో. వీళ్లు ప్రచారంలోకి దిగితే. అంతే సంగతులు. బీఆరెస్‌కు ముచ్చెమటలే. ఫామ్‌హౌజ్‌లో పడుకున్న కేసీఆర్ గజ్జుమంటాడు. అహంకారంతో విర్రవీగుతున్న కేటీఆర్‌కు కాళ్లు, చేతులు ఆడవు. వాళ్లతో పెట్టుకుంటే అట్లుండది మరి. మరి ఇలాంటి లీడర్లు ఎందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనలేదు. వాళ్లను రానీయలేదు. ఎవరు? కిషన్‌రెడ్డి. అవును.. తన రహస్య స్నేహితుడు కేటీఆర్‌ను అక్కడ గెలిపించే పనిని నెత్తుకెత్తుకున్నాడు కిషన్. షరా మామూలుగానే.
వీరిద్దరి మధ్య ఒప్పందం ఇప్పటిది కాదు. బీఆరెస్, బీజేపీ మద్య రహస్య ఒప్పందం జనాలకు కూడా తెలుసు.కానీ బయటపడరు. కానీ జనానికి మాత్రం తెలిసిపోతూనే ఉంటుంది. అర్వింద్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి.. వీళ్లందరికీ బీఆరెస్ అంటే భగ్గుమంటుంది. కర్రు కాల్చి ఎలా వాత పెట్టాలో వారి ప్రసంగాల్లో వందశాతం కనిపిస్తుంది. జనాలకు అది బాగా కనెక్టవుతుంది కూడా. బీజేపీ శ్రేణులకు వీరి ప్రసంగాలంటే ఇష్టం. బీఆరెస్‌ను ఆడుకునే ఆ స్టైల్ వారికి నచ్చుతుంది. కానీ వీరెవరినీ కిషన్‌రెడ్డి ఆ దరిదాపుల్లోకి కూడా రానీయలేదు. బండి సంజయ్‌ను మాత్రం లాస్ట్‌లో ఎంట్రీకి అవకాశం ఇచ్చాడు. కానీ అక్కడ అప్పటికే జరగాల్సిన ప్రమాదం బీజేపీకి జరిగిపోయింది. బీజేపీ కేవలం నిమిత్త మాత్రంగానే పోటీలో ఉందని తేలిపోయింది. కనీసం డిపాజిట్‌కూడా దక్కించుకునే పరిస్థితి అక్కడ లేదు. బీజేపీని బలి చేసి బీఆరెస్‌కు జీవం పోసే పనిని నెత్తికెత్తుకున్నాడు కిషన్‌రెడ్డి. ఈ విషయం అందరికీ స్పష్టమైంది. మరోమారు వీరిద్దరి రహస్య బంధం ఇలా తేటతెల్లమైంది.
