వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

ల‌క్ష్మీ పార్వ‌తికి, మాగంటి సునీత‌కు కొన్ని విష‌యాల్లో ద‌గ్గ‌రి పోలిక‌లున్నాయి. రాజ‌కీయంగా ఆమెకున్న చ‌రిత్రే ఇప్పుడు రిపీట్ అయ్యేలా ఉంది. భార్య దూర‌మైన త‌రువాత ల‌క్ష్మీపార్వ‌తి స‌తీమ‌ణిగా మారింది. కానీ ఇక్క‌డ అలా కాదు.. భార్య ఉండ‌గానే సంసారంలో సునీత పొగ‌బెట్టింది. అంతో ఇంతో ల‌క్ష్మీ పార్వ‌తిపై సానుభూతి ఉండేది. కానీ ఇక్క‌డ అదేమీ లేదు. ఇప్పుడు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతుంటే.. సునీత క న్నా వంద‌పాళ్లు ల‌క్ష్మీపార్వ‌తే బెట‌ర‌నిపిస్తుంది అందరికీ. ల‌క్ష్మీ పార్వ‌తీ ఆనాడు త‌న‌కిక తిరుగ‌లేద‌నుకుంది. రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు వాడుకుని పైకి ఎగ‌బాకాల‌నుకుంది. త‌న‌కంటూ ఓ గ్రూపును పెంచి పోషించింది. ఎన్టీఆర్ లేడు.. ఇక అంతా నేనే అనేలా ఆమె రాజ‌కీయాల‌ను ఓవ‌ర్ టేక్ చేసింది. చివ‌ర‌కు ఏమైంది..? ఘెరంగా డిపాజిట్లు కూడా కోల్పోయింది. ప్ర‌జ‌ల వ‌ద్ద త‌న ప‌ర‌ప‌తి ఏంటో..? ఆనాటి ఎన్నిక‌లు బ‌హిర్గ‌తం చేశాయి. ఇప్పుడిక్కడ జూబ్లీహిల్స్‌లో ఆ చ‌రిత్రే పున‌రావృతం కానుందా? అంటే అవున‌నే అనిపిస్తుంది.

ఎందుకంటే.. కేటీఆర్ ఈ విష‌యంలో చేయ‌ని డ్రామా లేదు. మాగంటి గోపీనాథ్ త‌ల్లి ఆరోపించిన‌ట్టుగా ఆయ‌న మ‌ర‌ణం సాధార‌ణం కాదు. అది హ‌త్యే.. ఆ హ‌త్య‌లో మాగంటి సునీత‌తోపాటు కేటీఆర్ కూడా భాగ‌స్వామే అనేది ఆ త‌ల్లి వాద‌న‌. ఆరోప‌ణ‌. ఆ మేర‌కు ఆమె ఫిర్యాదు కూడా చేసింది. నాడు ఎన్డీఆర్ మ‌ర‌ణం సాధార‌ణం. కానీ ఇక్క‌డ గోపీనాథ్ మ‌ర‌ణం మిస్ట‌రీ. ఆ మిస్ట‌రీలో ఇద్ద‌రున్నారంటున్న‌ది గోపీనాథ్ మాతృమూర్తి. స‌రిగ్గా పోలింగుకు ముందుగా ఒక్కొక్క‌టిగా అన్నీ బ‌య‌ట‌ప‌డుతున్నాయి. పాపాల‌న్నీ బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. ఇక రిజ‌ల్టే మిగిలుంది. ఆ చ‌రిత్రే ఇక్క‌డా పున‌రావృతం కానుంది. కావాల‌నే అనుకుంటున్నారంతా.