తెలంగాణలో 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలు చరిత్రలోనే అతి పెద్ద ఆథ్యాత్మిక- సాంస్కృతిక మహోత్సవంగా నిలవబోతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఈ పుష్కరాలను కుంభమేళా స్థాయికి తీసుకెళ్లాలని సంకల్పించారు. ఆ మేరకు యంత్రాంగానికి దిశానిర్ధేశం చేయడం మొదలైంది. ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ కేటాయించింది. జూలై 23, 2027 నుంచి ప్రారంభమయ్యే ఈ పుష్కరాలు భారత్ దేశానికి ఓ కుంభమేళాగా నిలచేలా ఏర్పాట్లు చేయాలని తలంచారు. శాశ్వత ఘాట్లు, ఆధునిక సదుపాయాలు, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు … ఇవన్నీ ప్రపంచానికి ఈ మహోత్సవాన్ని పరిచయం చేయనున్నాయి. గోదావరి నది 560 కి.మీ పొడవునా74 ఘాట్లు నిర్మించాలని డిసైడ్ చేశారు. 10 కోట్ల మంది భక్తులకు ఆహ్వానించే ఈ ఏర్పాట్లు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సారి. అందుకే సర్కార్ దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నది.
ఇది కేవలం ఆథ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు.. పవిత్ర స్నానాలు, వేద పూజలు, గిరిజన సంప్రదాయాలు, బతుకమ్మ, కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కలగకలిసి కనువిందు చేస్తాయి. చరిత్రలో నిలిచిపోతాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు దేశానికే కాదు.. ప్రపంచానికే పరిచయం కానున్నాయి మరోసారి ఈ వేదికగా.
బాసర, భద్రాచలం లాంటి పవిత్ర క్షేత్రాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. యాంత్రికుల సౌకర్యం ఓ వైపు… పవిత్రత మరోవైపు.. ఈ గోదారి పుష్కరాల్లో ఫరిడవిస్తాయి. భద్రతా విషయంలో అత్యంత అత్యాధునిక టెక్నాలజీ వినియోగించనున్నారు. ఏఐ ఆధారిత స్మార్ట్ పోల్స్, వేలాది సీసీటీవీల సంరక్షణ మధ్య పుష్కరాల ఏర్పాట్లు పకడ్బందీగా సాగనున్నాయి.
ఈ పుష్కరాల వల్ల పర్యాటకం మరింద అభివృద్ది కానుంది. తద్వారా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ప్రజలలో శాంతి, సామర్యతతో పాటు ఐక్యత కూడా ఫరిడవిల్లనుంది. ఆర్థికంగా, సాంస్కృతికంగా, ఆథ్యాత్మికంగా తెలంగాణ దశలోకి అడుగిడనుంది.
2025 గోదావరి పుష్కరాలు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలవనున్నాయి. ఇది రాష్ట్రాన్ని గ్లోబల్ స్థాయిలో నిలబెట్టనుంది. కుంభమేళా తరహాలో , మన తెలంగాణ పుష్కరాలు ప్రపంచానికి ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డికి హయాంలో జరిగే ఈ పుష్కరాలు ఈ ప్రభుత్వానికి ఘనకీర్తిని తెచ్చిపెట్టే విధంగా ఏర్పాట్లు ముమ్మరం చేయనున్నారు. దీని కోసం ఇప్పట్నుంచే కార్యచరణ, ప్రణాళిక మొదలైంది.