(దండుగుల శ్రీనివాస్)
మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్లే చేసిన బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలను అధిష్టానం లైట్ తీసుకున్నది. పార్టీ బీసీ నినాదాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పోరాటం చేస్తున్నది. ఢిల్లీ వేదికగా కేంద్రాన్ని సర్కిల్ చేస్తూ బీసీ సమాజం ముందు బీజేపీని దోషిగా నిలిపే ప్రయత్నం చేసింది. అందులో సక్సెసయ్యింది కూడా. కానీ ఇక్కడ మాత్రం అసందర్బంగా, తన ఆపతి తనకే అన్నట్టుగా మంత్రి పదవి కోసం బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు కోమటిరెడ్డి. పార్టీ ధిక్కార స్వరం వినిపించసాగాడు. ఒకరకంగా చెప్పాలంటే పార్టీ నుంచి విడిపోయి వేరు పార్టీలో మళ్లీ చేరాలనే ఆలోచన చేసే ఈ విధంగా చేశాడనిపిస్తోంది.
ఇక మంత్రి పదవి రాదనేది కన్ఫాం. అందులో డౌట్ లేదు. మరేం చేయాలి? మరో రెండు మంత్రి పదవుల బెర్తులు ఖాళీగా ఉన్నాయిగా.. ఓ రాయి విసిరేస్తే పోలా? అనుకున్నాడు. కానీ రాళ్లు రప్పలు విసిరేసిగా కాళ్లు పట్టుకున్నా.. అక్కడ మంత్రి ఈయనకు మంత్రి పదవి ఇచ్చే చాన్స్ లేదు. అదీ తెలుసు? అందుకే పార్టీకి గుడ్ బై చెప్పాలి. రాజీనామా అస్త్రం ప్రయోగించాలి.. అనుకున్నాడు. అందులో భాగంగానే బెదిరింపు రాజకీయాలకు దిగాడు. మీ సంగతి చెప్తా! మీ భరతం పడతా! మీ బండారం బయటపెడ్తా! అని ఏదేదో కామెంట్లు చేస్తూ మీడియాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. దీనిపై గాంధీ భవన్లో పార్టీ క్రమశిక్షణా కమిటీ భేటి అయ్యింది. వేరే అంశాలు చర్చకు వచ్చాయే తప్ప.. రాజగోపాల్ రెడ్డి మాటలను కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు.
ఆటలో అరటిపండే అయ్యాడు రాజగోపాల్ రెడ్ది. అతగాడి కింకర్తవ్యమేమిటీ? రాజీనామ చేయాలె. ఉప ఎన్నికలకు పోవాలె. అంతకు ముందు ఏ పార్టీలోకి పోవాలో ఆలోచించుకోవాలె. ఇంకా ఏ పార్టీ ఉంది. పాత పార్టీనే. బీజేపీలోకి పోతాడనే ప్రచారమూ జరుగుతోంది. అయితే అంతకు ముందు పార్టీని గెంటేస్తే కొంత సానుభూతి కూడా తోడవుతుందనుకున్నాడు. కానీ పార్టీ రాజగోపాల్‌ను పట్టించుకోలేదు. ఉంటే ఉండు.. లేకపోతే ఛల్ నడువ్ అన్నట్టే ఉంది. ఇలా చేస్తే మరి ఆత్మగౌరవం దెబ్బతినదాండీ! అందుకే రాజగోపాల్ రాజీనామా చేయాల్సిందే.. అని అంటున్నారు ఆయన అభిమానులు.
Dandugula Srinivas
Senior Journalist
8096677451