(దండుగుల శ్రీనివాస్)
వర్దంతి సందర్బంగా డీఎస్ విగ్రహాన్ని ప్రతిష్టాపించేందుకు సంకల్పించాడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. అన్ని ఏర్పాట్లు జరిగాయి. అమిత్ షా దీనికి హాజరవుతున్నాడు. రెండు అధికారిక ప్రోగ్రామ్స్ మధ్యలో విగ్రహావిష్కరణ పెట్టుకున్నారు. అంతా బీజేపీ నేతలే చేస్తుండటంతో డీఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమం పక్కా రాజకీయ రంగు పులుముకున్నది.
కరుడుగట్టిన కాంగ్రెస్ నేతగా ఉండి, మధ్యలో బీఆరెస్‌లో చేరి పశ్చాత్తాప పడి.. మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్న డీఎస్…. చివరకు ఆయన వర్దంతి మాత్రం బీజేపీ శ్రేణుల మధ్య జరుగుతున్నది. ఇదంతా ఒకరకమైన వివాదమైతే.. అర్వింద్ తనదైన మార్కు రాజకీయం ఇందూరులో మరింత రచ్చ రాజకీయానికి తెరలేపింది. డీఎస్ పెద్ద కుమారుడు, మాజీ మేయర్ సంజయ్‌కు ఆహ్వానం అందలేదు. కనీసం పిలుపు లేదు. తనతో పాటు జిల్లా కాంగ్రెస్ శ్రేణులను కూడా పిలవలేదనే చెబుతున్నారు.
చివరకు జిల్లాకే చెందిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు కూడా పిలుపు లేదని తెలిసింది. అర్వింద్ కేవలం మున్నూరుకాపు సంఘం ప్రతినిధులకు మాత్రం ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది.