(దండుగుల శ్రీనివాస్)
మొన్న సీఎం రేవంత్ పై కేటీఆర్ వాడిన బూతులు బాగానే హర్ట్ చేశాయి సీఎంను. అవును మరి. అంతలా రెచ్చిపోయి మాట్లాడిండు కేటీఆర్. కేసీఆర్‌ను విచారణ పేరుతో కాళేశ్వరం కమిషన్ రప్పించుకున్న సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కంట్రోల్ తప్పాడు. చిల్లరగాడు, హౌలేగాడు, మా వెంట్రుక కూడా పీక్కోలేవు. ఇవన్నీ గతంలో కూడా అన్నవే. కానీ మొన్న ఇంకా ఎక్కువ మోతాదులో తిట్ల దండకమందుకున్నాడు. అందుకే సీఎం దీన్ని ప్రజల ముందుంచేందుకు.. రైతులతో ముఖాముఖిలో ఈ ప్రస్తావన తెచ్చాడు. మొరిగే కుక్కను పట్టించుకోను.. అన్నాడు.
ఎంత గింజుకున్నా మేమే బిడ్డా పదేండ్లు అన్నాడు. కానీ ఏసీబీ విచారణ మరోసారి ఉంటుందని సంకేతాలిచ్చిన నేపథ్యంలో.. ఈసారి జైలుకు పంపేలా ఉన్నాడు సీఎం రేవంత్‌రెడ్డి. మౌనంగా ఉంటూనే.. నేను పట్టించుకోవడం లేదు.. వాళ్లు ఒర్రేది ఒర్రుతరు.. నేను నా పని చేసుకుంట పోతా.. అన్నాడు. జనాలకు జవాబుదారీగా. కానీ మనసులో అగ్ని పర్వతం రగులుతున్నది. తనకు చిప్పకూడు తినిపించినట్టే.. కేటీఆర్‌కూ తినిపించాలని రేవంత్ ఉవ్విళ్లూరుతున్నాడు. రగిలిపోతున్నాడు. అంతే కాదు బీఆరెస్ సెక్షన్లో ఓ ప్రచారం జరుగుతోంది. రేవంత్ సతీమణి కూడా .. కేటీఆర్‌ను లోపలేస్తవా..? లేదా..? అని ఒత్తిడి తెస్తున్నది.. ఆమె కూడా తీవ్ర ప్రతీకారకాంక్షతో రగిలిపోతున్నదని కామెంట్లు చేసుకుంటున్నారు. అంటే ఈసారి ఇక నేరుగా కేటీఆర్ జైలుకే పోతాడన్నమాట. అంతే అంతే .. అధికారం చేతులుంటే ఏమైనా చేయొచ్చు.
Dandugula Srinivas
Senior Journalist
8096677451